Egg 65: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ, దీని రుచి ఎవరికైనా నచ్చేస్తుంది-egg 65 recipe in telugu know how to make this in a simple way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg 65: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ, దీని రుచి ఎవరికైనా నచ్చేస్తుంది

Egg 65: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ, దీని రుచి ఎవరికైనా నచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu
Nov 21, 2024 05:30 PM IST

Egg 65: కోడిగుడ్డంటే ఎంతోమందికి ఇష్టం. కోడిగుడ్లతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడేము ఎగ్ 65 ఇచ్చాము. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఎగ్ 65 రెసిపీ కూడా చేయడం చాలా సులువు.

ఎగ్ 65 రెసిపీ
ఎగ్ 65 రెసిపీ

గుడ్లను మాంసాహారులు మాత్రమే కాదు శాఖాహారులను కూడా తినమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన లోపం రాకుండా ఉండాలంటే ప్రతిరోజ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తినమని ప్రోత్సహిస్తున్నారు. ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కండరాలు, కణజాలాలను రిపేర్ చేయడానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి.

మన శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి గుడ్లు చాలా అవసరం. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.  ఎముకల బలాన్ని పెంచుతాయి. వీటిలో రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్లు ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ డి,  కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న గుడ్లతో ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీలను వండకుండా ఓసారి కొత్త వంటకాలు కూడా ప్రయత్నించండి. ఈ రోజు స్పెషల్ ఎగ్ కర్రీ తయారు చేయాలనుకుంటే ఇక్కడ మేము ఎగ్ 65 రెసిపీ ఇచ్చాము. దాని రుచి మీకు కచ్చితంగా నచ్చుతుంది.

ఎగ్ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గుడ్లు - అయిదు 

మైదా పిండి - రెండు స్పూన్లు 

కార్న్ ఫ్లోర్ -  నాలుగు స్పూన్లు 

కారం - నాలుగు స్పూన్లు  

గరం మసాలా - ఒక స్పూన్ 

జీలకర్ర పొడి - ఒక స్పూన్ 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్ 

నూనె - తగినంత, 

ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ 65 రెసిపీ

  1. ముందుగా కోడిగుడ్లను ఉడికించి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.  
  2.  తర్వాత ఒక గిన్నెలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. 
  3.  అందులో కొద్దిగా నీళ్లు పోసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా వేసుకోవాలి. 
  4. తర్వాత గుడ్డును నాలుగు భాగాలుగా కట్ చేసి తయారుచేసిన పేస్ట్ లో కలపాలి.
  5.  ఈ మిశ్రమం గుడ్డులోని అన్ని భాగాలకు పట్టేలా చూసుకోవాలి. 
  6. ఈ బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. ముందుగా పెద్ద మంటపై మూడు నిమిషాలు వేడి చేయాలి. తర్వాత మీడియం మంట మీద ఉంచాలి. 
  7.   కోడిగుడ్డు ముక్కలను వేడెక్కిన నూనెలో వేసి వేయించాలి. 
  8.  కోడిగుడ్డు ముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి టిష్యూ పేపర్ మీద వేయాలి. 
  9.   అంతే టేస్టీ ఎగ్ 65 రెడీ అయినట్టే. దీన్ని  గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.  

ఎగ్ 65 రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. పిల్లలు కూడా ఈ గుడ్డు రెసిపీని ఇష్టపడతారు. సాయంత్రపూట చాలా సింపుల్‌గా ఈ స్నాక్ వండేసుకోవచ్చు. పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. 

Whats_app_banner