Effects Of Bottle Feeding: పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తున్నారా? దీని వల్ల కలిగే అనర్థాలేంటో తెలుసుకోండి!
Effects Of Bottle Feeding: పిల్లలకు తల్లిపాలు సరిపోకపోకపోయినా, తల్లి పాలు పట్టలేని స్థితిలో ఉన్నా డబ్బా పాలను పట్టిస్తుంటారు. ఇది పిల్లల ఆరోగ్యం మీద, ఎదుగుదల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? బాటిల్ ఫీడింగ్ వల్ల పిల్లవాడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ అనర్థాలేంటో తెలుసుకుందాం.
తల్లి పాలు శిశువు ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటివి. ఇవి నవజాత శిశువులకు అమృతంతో సమానమని పెద్దలు, నిపుణులు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు. ఎందుకంటే తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఇది పుట్టిన 6 నెలల వరకు శిశువును అన్ని ఆహార అవసరాలను తీరుస్తుంది. కానీ కొన్నిసార్లు కొత్త తల్లులు తల్లి పాలివ్వడంలో సమస్యలు తలెత్తాయి. కొందరు తల్లులు బిడ్డకు పాలివ్వలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటప్పుడు తప్పదు. కానీ వేరే పనులకు ప్రాధ్యాన్యత ఇస్తూ, వృత్తిరీత్యా పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే ఫార్ములా పాలు(డబ్బా పాలు) పట్టించే తల్లిదండ్రులు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి.
బాటిల్ ఫీడింగ్ చేయడం వల్ల పిల్లవాడు లేదా పిల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కొన్ని కారణాల వల్ల తల్లి తక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంటే లేదా ఆమె తన బిడ్డకు పాలివ్వలేకపోతే, పుట్టిన రెండు లేదా మూడు వారాల తర్వాత మాత్రమే ఆమెకు బాటిల్ పాలు ఇవ్వాలి. బాటిల్ ఫీడింగ్ వల్ల కలిగే అనర్థాలేంటో తెలుసుకుందాం.
పిల్లలకు డబ్బా పాలు పట్టించడం వల్ల కలిగే అనర్థాలేంటి?
ఊబకాయం:
తల్లిపాలకు బదులు బాటిల్ ఫీడ్ ఇచ్చే పిల్లలకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శిశువుకు పౌడర్ లేదా పశువుల పాలు పట్టించినప్పడు వారి అనవసర బరువు పెరిగే అవకాశాలున్నాయి.
ఇన్ఫెక్షన్:
బాటిల్ మిల్క్ తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్ ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకు తరచూ విరేచనాలు, ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర సంక్రమణ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
చనుమొన గందరగోళం(nipple confusion):
నవజాత శిశువులకు వీలైనంతవరకూ మొదటి నెలలో డబ్బా పాలు పట్టించకూడదు. ఈ పాలు తాగడం వల్ల పిల్లలలో చనుమొన గందరగోళం ఏర్పడుతుంది. ఎందుకంటే రొమ్ము నుంచి పాలు తాగే పద్ధతి, బాటిల్ నుండి పాలు పీల్చే విధానం భిన్నంగా ఉంటుంది. బిడ్డకు రొమ్ము పాలతో పోలిస్తే బాటిల్ నుండి పాలు తాగడం సులభం. వేగంగా తాగగలుగుతాడు, ఇది వారికి అలవాటు అయితే తర్వాత తల్లిపాలను తాగడానికి ఇష్టపడరు.
ఊపిరితిత్తులు బలహీనపడటం
రబ్బరు చనుమొనల నుండి పాలు తాగే శిశువుల ఊపిరితిత్తులు తల్లిపాలు తాగే శిశువుల కంటే బలహీనంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల శ్వాసకోశ సమస్యలపై కూడా ప్రభావం చూపుతుంది.
మైక్రోప్లాస్టిక్ ప్రమాదంలో పడదారు
ప్లాస్టిక్ బాటిల్ నుండి పాలు తాగే పిల్లలు మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదానికి గురవుతారు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఐర్లాండ్ పరిశోధకుల ప్రకారం, డబ్బా పాలు తాగే పిల్లలు శరీరంలోకి ప్రతిరోజూ ఒక మిలియన్ కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ ప్రవేశిస్తాయట.
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
మీరు పనిచేసే తల్లులైతై ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ డబ్బుతో కొనలేనిది మీ పిల్లల ఆరోగ్యం. మీ వృత్తి కన్నా మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమ, బాధ్యత మీకు ఎక్కువ. కనుక పిల్లలకు కనీసం ఆరు నెలల పాటైనా తప్పకుండా మీ పాలనే ఇవ్వండి.
పాలు రాని పరిస్థితుల్లో మీ ఉంటే ఇందుకు తగిన ఆహారాలను తీసుకొండి. దీని కోసం తల్లి తగినంత నీరు మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తినే ఆహారం మీతో పాటు మీ పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. వారి భవిష్యతును శక్తివంతంగా, ఆహ్లాదకరంగా మారుస్తుంది.
లేదు తప్పదు అంటే..
పని చేయక తప్పదు, వేరే అవకాశమే లేదు అన్నప్పుడు మీ బిడ్డ కోసం మీ పాలనే డబ్బాలో పట్టి నిల్వ చేసి పనికి వెళ్లండి. ఉదయాన్నే తక్కువగా తాగినా, రాత్రంతా తప్పకుండా మీ పాలే పట్టించే ప్రయత్నం చేయండి. మీ పిల్లలకు మీ అవసరం ఉందని గమనించండి.
సంబంధిత కథనం