Hangover Tips: హ్యాంగోవర్‌తో తలపట్టుకుని కూర్చోకండి.. ఈ డ్రింక్స్‌తో క్షణాల్లో రిలీఫ్ పొందండి
న్యూ ఇయర్ పార్టీ మరుసటి రోజు తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారా.. లాస్ట్ నైట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని రియలైజ్ అయ్యారా.. అయితే రండి. ఎటువంటి హ్యాంగోవర్ లేకుండా, మళ్లీ ఉత్సాహవంతంగా మార్చే డ్రింక్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ 5 బెస్ట్ టెక్నిక్స్‌తో హ్యాంగోవర్ నుంచి వెంటనే కోలుకోండి.
న్యూ ఇయర్ అంటేనే సంబరాలు, బౌండరీల్లేని ఎంజాయ్మెంట్ ఉండాలని ఆశిస్తారు. డిసెంబర్ 31 నైట్ కోసం కొన్ని వారాల ముందు నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటారు. భారీ ఏర్పాట్లతో రెడీ అయిన న్యూ ఇయర్ పార్టీలో ఆల్కహాల్ కూడా కచ్చితంగా ఉంటుంది. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూనే మరోవైపు లెక్కలేకుండా మద్యం తాగేస్తుంటారు. అప్పటివరకూ ఓకే కానీ, మరుసటి రోజే అసలైన సమస్య మొదలవుతుంది. నూతన సంవత్సరం తొలిరోజే హ్యాంగోవర్ సమస్యతో తలపట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. కొత్త సంవత్సరం పార్టీ మరుసటి రోజు తలనొప్పి, ఎర్రటి కళ్ళు, కండరాల నొప్పి, అధిక దాహం, బీపీలో హెచ్చుతగ్గులు, మైకము, చిరాకు వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.
న్యూ ఇయర్ పార్టీ తర్వాత మీరు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఇది మీకోసమే, మీకు దీని గురించి సంబంధం లేదనుకుంటే మీ సన్నిహితులకు దీని గురించి తెలియజేయండి. మరి హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కోసం మనమేం చేయాలో తెలుసుకుందామా..
హైడ్రేషన్‌గా ఉండాలి:
వైద్య నిపుణుల సలహా ప్రకారం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా మద్యం మత్తును సులభంగా వదిలించుకోవచ్చు. అధికంగా మద్యం సేవించడం వల్ల, ఏ వ్యక్తికైనా మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో వాసోప్రెసిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల మూత్రపిండాలలో మూత్రం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ నీరు తాగడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. దీని వల్ల ఆల్కహాల్ ప్రభావం రక్తంలో వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా ఆ వ్యక్తి హ్యాంగోవర్ నుండి క్షణాల్లో ఉపశమనం పొందుతాడు.
పిప్పరమింట్:
హ్యాంగోవర్ను తొలగించడానికి పిప్పరమింట్ ట్రీట్మెంట్ కూడా చాలా ప్రభావవంతమైనదని చెబుతుంటారు. వేడినీటిలో 3 నుంచి 4 పుదీనా ఆకులు వేసి తాగితే ఆల్కహాల్ మత్తు వెంటనే పోతుంది.
నిమ్మరసం:
నిమ్మరసం మత్తును తొలగించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఇది ఆల్కహాల్ ప్రభావం నుంచి త్వరగా రిలీఫ్ చేస్తుంది. ఫలితంగా హ్యాంగోవర్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెమెడీ పాటించడానికి ఒక గ్లాసు చల్లటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే సరిపోతుంది. కొద్ది క్షణాల్లోనే మత్తు దాని వల్ల కలిగిన సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
అల్లం:
ఆల్కహాల్ మత్తును తొలగించడంలో అల్లం జ్యూస్ రెమెడీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అసౌకర్యాన్ని తొలగించే ఔషధ గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇది తలనొప్పి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం రసం రుచికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తే అందులో కాస్త తేనె కూడా కలుపుకుని తాగవచ్చు.
ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్లు లేదా కొబ్బరి నీరు:
ఎలక్ట్రోలైట్స్ ఉన్న ద్రావణాలైన కొబ్బరి నీరు, లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగితే బెటర్. ఇవి శరీరంలో అవసరమైన సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను తిరిగి పెంచుతుంది. అలా హ్యాంగోవర్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ముందుగానే విటమిన్ బీ, జింక్:
మద్యం తాగడానికి 24 గంటల ముందు తగినంత మొత్తంలో విటమిన్ బి, జింక్ తీసుకునే వ్యక్తులు హ్యాంగోవర్ ప్రభావాన్ని చాలా తక్కువగా ఎదుర్కొంటారని నిపుణుల అభిప్రాయం. ఏదేమైనా, ఈ అధ్యయనంపై మరింత పరిశోధన ఇంకా అవసరం.
సంబంధిత కథనం