Chest Pain Remedies । ఛాతీనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇవిగో ఆయుర్వేద పరిష్కారాలు!
Chest Pain - Ayurveda Remedies: ఛాతీ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి. అవి ఇక్కడ తెలుసుకోండి.
Chest Pain - Ayurveda Remedies: చాలా మందికి ఛాతీలో అసౌకర్యం కొన్నిసార్లు ఎందుకు కలుగుతుందో తెలియదు గుండె, ఊపిరితిత్తులు, కండరాల కణజాల వ్యవస్థ, భయాందోళనలు ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి ఉంటుంది. అజీర్ణం, శారీరక శ్రమ ఎక్కువైన సందర్భాల్లో కూడా ఛాతీ నొప్పి తలెత్తుతుంది. ఛాతీ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి. మీ ఆరోగ్యంను, శ్రేయస్సును ప్రోత్సహించడానికి, వివిధ రకాల అసౌకర్యాలను తగ్గించడానికి, అనారోగ్య సమస్యలకు సహజ నివారణలను ఆయుర్వేద వైద్యం మీకు అందిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
మీరు ఛాతీ నొప్పి సంబంధిత లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే, మీలాంటి వారి కోసం ఆయుర్వేద డాక్టర్, గట్ హెల్త్ కోచ్డాక్టర్ డింపుల్ జంగ్దా, ఛాతి నొప్పిని నియంత్రించడానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణలను తెలిపింది, అవి ఇక్కడ తెలుసుకోండి.
కలబంద
కలబంద అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుత మొక్క. ఇది మీ హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ ఛాతీ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఛాతీలో మంటగా ఉంటే మీరు కలబంద రసాన్ని రోజుకు 1 నుండి 2 సార్లు తప్పనిసరిగా త్రాగాలి.
వేడి పానీయాలు
వేడిగా ఏదైనా తాగడం ద్వారా ఛాతీ నొప్పిని తగ్గించవచ్చు. అది ఒక గ్లాసు వేడి నీరు కావచ్చు లేదా ఒక కప్పు హెర్బల్ టీ కావచ్చు. ఈ పానీయం ఉబ్బరం లేదా అజీర్ణం కారణంగా వచ్చే ఛాతీ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వేడి పానీయాలు ఉబ్బరం తగ్గిస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తులసి
తులసిలో విటమిన్ కె, మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటాయి. మెగ్నీషియం గుండెకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, రక్త నాళాలను సడలిస్తుంది, విటమిన్ K మీ రక్త నాళాల గోడలలో కొలెస్ట్రాల్‌ను నిర్మించడాన్ని నిరోధిస్తుంది. ఇది గుండె సంబంధిత రుగ్మతలతో పాటు ఛాతీ నొప్పికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. 8-10 తులసి ఆకులను నమలడం, తులసి టీని సిప్ చేయడం లేదా ఒక టీస్పూన్ తులసి రసాన్ని తీసి తేనెతో కలిపి సేవించడం ద్వారా ఛాతీ నొప్పి ద్వారా ఉపశమనం పొందవచ్చు.
ముఖ్య గమనిక: మీకు కలిగే ఛాతీ నొప్పి అజీర్ణంకు సంబంధించినది లేదా తీవ్రమైన శారీరక శ్రమకు సంబంధించినది అయితే పైన పేర్కొన్న ఆయుర్వేద నివారణలు ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ, ఈ రెమెడీస్ ఉపయోగించిన తర్వాత ఛాతీ నొప్పి కొనసాగితే తక్షణ వైద్య సహాయం అవసరం, ఎందుకంటే ఇది తీవ్రమైన అంతర్లీన స్థితికి సంకేతం కావచ్చు అని డాక్టర్ జంగ్దా అన్నారు.
సంబంధిత కథనం