Watermelon On Empty Stomach : పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?-eating watermelon on empty stomach is good or bad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Watermelon On Empty Stomach Is Good Or Bad

Watermelon On Empty Stomach : పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?

Anand Sai HT Telugu
Mar 19, 2024 01:30 PM IST

Watermelon On Empty Stomach In Telugu : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో తినాల్సిన పండు ఇది. అయితే దీనిని ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?

పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినవచ్చా?
పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినవచ్చా? (Unsplash)

పుచ్చకాయలో పోషకాలు అధికంగా ఉంటాయి. హైడ్రేషన్‌కు ఇది సరిగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే చాలా మంది దీనిని ఇష్టం వచ్చిన సమయంలో తింటారు. కానీ ఉదయంపూట ఖాళీ కడుపుతో తినడం మంచిదేనా?

ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేయడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవచ్చు. మీ రోజును ప్రారంభించడం విషయానికి వస్తే పుచ్చకాయ ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే 90 శాతం నీరు, విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి అద్భుతమైనది ఉపయోగపడుతుంది.

అధిక ఫైబర్ కంటెంట్, పోషక విలువలు పుచ్చకాయను మీ అల్పాహారంలో చేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే పుచ్చకాయను ఖాళీ కడుపుతో అందరూ తినవచ్చా? ఖాళీ కడుపుతో దీనిని తింటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం..

పుచ్చకాయలో పోషకాలు

పుచ్చకాయ విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం అధికంగా ఉండే పండు. వేడి, తేమతో కూడిన వాతావరణంలో మంచి హైడ్రేషన్ మూలంగా ఉపయోగపడుతుంది. కానీ ఈ పండును ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినకూడదు. ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం వారి శరీర రకం, హార్మోన్ల పనితీరు ఆధారంగా ప్రయోజనం చేకూర్చవచ్చు లేదా ప్రయోజనం పొందకపోవచ్చు.

రోజూ ఉదయం తినవచ్చా?

ఒక వ్యక్తి లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలను చూపిస్తే లేదా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే అల్పాహారం సమయంలో పండు తినడానికి సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇది లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అయితే ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు పండును తక్కువ పరిమాణంలో చిరుతిండిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. శరీరంలో అధిక లెప్టిన్ స్రావం కారణంగా సున్నితత్వం తగ్గి, ఫ్రక్టోజ్ అసహనానికి కారణమవుతుంది. తద్వారా శరీరంలో అధిక కొవ్వు ఉత్పత్తి, నిల్వకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

వీరు తినకపోవడమే బెటర్

ఫ్రక్టోజ్ అసహనం ఉన్నవారికి ఉదయాన్నే పుచ్చకాయ తినడం హానికరం. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. శరీరం పండ్లను ఉదయం తింటే తట్టుకుంటే... పోషకాల శోషణ కోసం ఉదయాన్నే తినవచ్చు. పుచ్చకాయలో ఫైబర్ ఉండటం వల్ల గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయతో చాలా ప్రయోజనాలు

పుచ్చకాయలో ఉండే లైకోపీన్, కుకుర్బిటాసిన్ తోపాటుగా ఇందులో కనిపించే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. లైకోపీన్ ప్రొస్టేట్, కొలొరెక్టర్ క్యాన్సర్ల ముందు తగ్గేందుకు పుచ్చకాయ తినాలి.

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించేందుకు పుచ్చకాయ లైకోపీన్ సాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయి వలన కలిగే దుష్ర్పభావాలను నివారిస్తుంది. పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అమైనో యాసిడ్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెంచేందుకు సాయపడుతుంది. ఇది రక్తనాళాలు విస్తరించేందుకు ఉపయోగపడి.. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది.

శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా పుచ్చకాయ ఉపయోగపడుతుంది. శరీరం ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండాలి అంటే.. అవయవాలు సక్రమంగా పని చేయాలంటే శరీరంలో నీటి శాతం ఉండాలి. పుచ్చకాయ తింటే శరీరానికి నీటి శాతం అందుతుంది. పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సితోపాటుగా పలు రకాల పోషకాలు ఉంటాయి.