సలాడ్ తీసుకునే చాలా మంది చేసే పొరబాటు ఏంటంటే, చలువదనానికి దోసకాయ, రుచికోసం టమాటా చిన్న ముక్కలుగా చేసుకుని వాడటం. కానీ, ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి చేటు చేస్తుందట. సలాడ్ ఫైబర్ కోసం కీరదోసను జతచేస్తాం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అయితే, ఆయుర్వేదం సూచిస్తున్న ఆహార నియమాల ప్రకారం.. సలాడ్ లోనైనా, మరెందులోనైనా టమాటా, కీరదోసను కలిపి తినకూడదట. ఒకవేళ తింటే ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.
ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతిని, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ టమాటో + కీరదోస. ఈ రెండు కూరగాయలు విరుద్ధ ఆహారాల జాబితాలో ఉన్నాయి. వేర్వేరు సమయాల్లో జీర్ణమవుతాయి. కాబట్టి, కీరదోసను, టమాటోను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
టమాటో, కీరదోసను కలిపి తినడం వల్ల పోషకాల శోషణ సరిగా జరగదు. టమాటోలో విటమిన్ సి, కీరదోసలో కుకుర్బిటాసిన్ అధికంగా ఉంటాయి. ఇవి కలిపి తీసుకుంటే, జీర్ణమైన ఆహారం నుంచి పోషకాలను శోషించుకునేందుకు అడ్డంకిగా మారుతుంది.
టమాటో, కీరదోస రెండింటిలోనూ నీరు అధికంగా ఉంటుంది. కానీ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్తి, ఉబ్బరం, బ్లోటింగ్ వంటి సమస్యలు కలుగుతాయి.
కీరదోస, టమాటో కలిపి తినకుండా ఇతర పదార్థాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవాలనుకుంటే, ఇవి ట్రై చేయండి.
కీరను మజ్జిగతో కలిపి తినడం చాలా మంచిది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా తక్షణ శక్తిని అందించి నీరసం తగ్గుతుంది.
టమాటో, క్యారెట్ కలిపి సలాడ్ లేదా జ్యూస్ తయారుచేసుకోవచ్చు. ఈ రెండు ఆహార పదార్థాలు విటమిన్ A, C తో నిండినవి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
కీరను పండు లేదా స్మూతీతో కలిపి తినడం మంచి ప్రత్యామ్నాయం. పాలు లేదా కొబ్బరి నీటితో కూడా స్మూతీ చేసుకోవచ్చు. దీని వలన మిక్స్డ్ న్యూట్రియెంట్స్ సమకూరుతాయి.
టమాటోను కాబేజితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మంచి ఫైబర్ కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కీరతో నిమ్మరసం లేదా నిమ్మచుర్ణం కలిపి తినడం కూడా మంచి డిటాక్స్ రెమెడీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
కీరను ఆపిల్‌తో కలిపి స్మూతీ చేయడం మంచి ఆహారం. ఇది శరీరానికి ప్రాముఖ్యమైన యాంటీఆక్సిడెంట్స్‌ను అందిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్