Sprouted seeds: మొలకెత్తిన గింజలతో ఈ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది
Sprouted seeds: మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు దానితో రుచికరమైన భేల్ తయారు చేయవచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌లా తినవచ్చు. ఇది డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ తినమని సిఫారసు చేస్తారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా, ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, మొలకల్లో మంచి మొత్తంలో ఇనుమును కలిగి ఉంటాయి. ఇది రక్త హీనత సమస్య రాకుండా అడ్డుకుంటుంది. దీని సహాయంతో టేస్టీ భేల్ ను తయారు చేసుకోవచ్చు. మొలకలతో రుచికరమైన భెల్ ఎలా తయారు చేయాలో ఇక్కడ మేము మీకు చెబుతున్నాము. దీన్ని రుచికరంగా బ్రేక్ ఫాస్ట్ చేసుకోవచ్చు.
మొలకెత్తిన గింజలతో బ్రేక్ ఫాస్ట్
ఈ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందుగా మొలకెత్తిన పెసలను తీసుకోవాలి. వీటిని ముందుగానే నానబెట్టుకుంటే అవి మొలకలు వస్తాయి. వాటిని నీటిలో నానబెట్టాక ఒక శుభ్రమైన వస్త్రంలో కట్టాలి. అప్పుడు కొన్ని గంటల తరువాత మొలకలు వస్తాయి. ఇప్పుడు వాటితో భేల్ తయారుచేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో రెడీమేడ్ మొలకలు లభిస్తాయి. వాటిని కొనుక్కోవడం ద్వారా కూడా బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు మొలకెత్తిన గింజలను కాసేపు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత వాటిని తీసి ఒక ప్లేటులో వేయాలి. అందులో సన్నని ఉల్లితరుగు, టొమాటో తరుగు, కీరదోసకాయ తరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే చాట్ మసాలా, చిటికెడు ఉప్పు, నిమ్మరసం చల్లుకోవాలి. పైన సన్నని కారప్పూస, కొత్తిమీర తరుగు వేసి వాటిని తినేయచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. డయాబెటిస్ పేషెంట్లు కూడా వీటిని తినవచ్చు. దీని పచ్చిఉప్పు వేస్తాము కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు.
మొలకెత్తిన గింజలను బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఇనుము అధికంగా ఉంటాయి. ఈ మొలకెత్తిన గింజల వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ మొలకెత్తిన గింజలు. వీటిని తింటే ఆ రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటారు. పైగా ఇవి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం