Sprouts | మొలకలు ఇలా తింటే నష్టమే..
మెులకలు తినడం వల్ల ఉపయోగాలే కాదు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇష్టారీతిన మొలకలు తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా కాకుండా మొలకలు ఎలా తినాలి.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మెులకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరమని నిపుణులు చెబుతుంటారు. మెులికెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ కె ఎక్కువ ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్దిగా లభిస్తాయి. అలాగే పీచు, ఫోలేట్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజువారి డైట్‌లో మొలకలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా పచ్చి శెనగలు, చిక్కుళ్ళు, బఠాని వంటి ధాన్యాల నుండి మొలకలు తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. మొలకెత్తిన ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ డితో సహా అనేక పోషకాలు లభిస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
అయితే మెులకలు తినడం వల్ల ఉపయోగాలే కాదు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇష్టారీతిన మొలకలు తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా కాకుండా మొలకలు ఎలా తినాలి.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
పచ్చి మొలకలు తినడం మానుకోండి
ముడి మొలకలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదానికి కారణమవుతుంది. మొలకలను 12 నుంచి 72 గంటలు దాటిన తర్వాత తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగి అతిసారం, కడుపు నొప్పి, వాంతులను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండే యువకుల్లో దీని ప్రభావం పెద్దగా కనిపించకపోయినా, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది.
మొలకలు తినడానికి సరైన మార్గం
పచ్చి మొలకలను డైరెక్ట్‌గా తింటే కొందరికి అసౌకర్యంగా ఉంటుంది. అందుకే ముందుజాగ్రత్తగా, వాటిని కొద్దిగా నూనెలో వేడి చేయడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. నూనెలో వద్దనుకుంటే ఉప్పు నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టండి. ఈ విధంగా మొలకలను వాడటం వల్ల మీ జీర్ణవ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, అంతేకాకుండా మీ జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా పోషకాలను గ్రహిస్తుంది. కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా పచ్చి మొలకలను ఉడికించి తినడం మంచిది.
నిపుణుల అభిప్రాయం
పచ్చి మొలకలను నేరుగా తింటే కొందరి శరీరాలకు పడవు, అవి సరిగ్గా జీర్ణం అవ్వకుండా జీర్ణవ్యవస్థలో సమస్యలు కలుగజేస్తాయి. కొందరి శరీరాలు పచ్చి విత్తనాలలో ఉండే పోషకాలను గ్రహించలేవు. అందువల్ల మొలకలను కొద్దిగా ఉడికించుకొని తింటే, సులువుగా జీర్ణం అవడమే కాకుండా అందులోని పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.