శరీరం సరైన మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు డయాబెటిస్ సమస్య మొదలవుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని ఆచితూచి మాత్రమే తీసుకోవాలి. కానీ, గుమ్మడి గింజల విషయంలో అలా కాదట. ప్రశాంతంగా కావాల్సినంత మేర లాగించేయొచ్చట. ఎందుకంటే, గుమ్మడి గింజల్లో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ స్నాక్ గానే కాకుండా వీటిల్లో ఉండే పోషకాల కారణంగా పూర్తి ఆరోగ్యవంతులుగా కూడా ఉండొచ్చట.
ఇంత చిన్నగింజలు బ్యాలెన్స్‌డ్ లైఫ్‌స్టైల్‌తో పాటు ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఇంకా ఇవి డయాబెటిస్‌తో పోరాడేందుకు తోడ్పడతాయట కూడా. అదెలాగో తెలుసుకుందాం రండి.
కాస్త తియ్యగా అనిపించే గుమ్మడి గింజలు సైజు విషయంలో చాలా చిన్నగా ఉంటాయి. వీటిని వేయించుకుని, ఉప్పు కలుపుకుని ఎండబెట్టుకుని పలు రకాలుగా తీసుకోవచ్చు. గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ ( మెగ్నీషియం, జింక్, ఐరన్) వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషక విలువలన్నీ డయాబెటిస్ తో పోరాడేందుకు సరిగ్గా సరిపోతాయట.
డయాబెటిస్ సమస్యను నియంత్రించేందుకు గుమ్మడి గింజలు ఎలా తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయో తెలుసుకోండి.
పచ్చివి లేదా వేయించిన గుమ్మడి గింజలు: స్నాక్స్ సమయంలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పచ్చి లేదా వేయించిన గుమ్మడి గింజలు తీసుకోండి. ఉప్పు కలిపి లేదా మరేదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుని తింటే బాగుంటాయి. సాధారణంగా బీపీ ఉన్న వారు ఉప్పు కలపకపోవడమే బెటర్.
గుమ్మడిగింజల పౌడర్: గుమ్మడి గింజలను గ్రైండ్ చేసుకుని పౌడర్ పక్కకుపెట్టుకోండి. దానిని స్మూతీలలో, సూప్ లలో యోగట్ ల మీద ఒకటి లేదా 2 టీస్పూన్లు వేసుకుని తినవచ్చు.
గుమ్మడి గింజల పాలు: అర కప్పు గుమ్మడి గింజలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోండి. ఆ తర్వాత వాటిని తీసుకుని రెండు కప్పుల నీటితో కలిపి పాలలాగా మెత్తగా చేసుకోండి. దీనిని స్మూతీలపైన, ఓట్ మీల్స్ మీద, టీ మాదిరిగా ఎలానైనా తీసుకోవచ్చు.
అయితే గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోబోయే వైద్యుడ్ని సంప్రదించడం బెటర్.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.