Mango Pickle Side Effects : మగవాళ్లు మామిడి పచ్చళ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
Pickles Side Effects : తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ఎంత మంచి కూర వండినా.. కాస్త పచ్చడి మెతుకులు తింటేనే కొందరికీ తృప్తి. కానీ ఇలా మామిడికాయ పచ్చడి ఎక్కువగా తింటే మగాళ్లకు మంచిది కాదు.

ఎండాకాలం వస్తే.. దాదాపు అందరి ఇళ్లలో మామిడికాయ పచ్చడ పెట్టుకుంటారు. తర్వాత ఏడాది పొడవునా ఇది సరిపోతుంది. అయితే ఈ పచ్చళ్లు అప్పడప్పుడు తింటే ఏం కాదు. కానీ ప్రతీరోజు.. ఎక్కువ మెుత్తంలో తింటే మాత్రం సమస్యలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో మగావాళ్లు మాత్రం పచ్చళ్లను అస్సలు ఎక్కువగా తినకూడదు.
పచ్చళ్లు రుచిగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటి పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. ఊరగాయ లేని భోజనం చప్పగా ఉంటుందని సామెత కూడా ఉంటుంది. అయితే మీరు పచ్చళ్లను ఎక్కువగా తింటే మీ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషులు ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
కొన్ని రోజులైతే మామిడి పండ్ల సీజన్. మీలో చాలామంది మామిడికాయ పచ్చడి తయారీలో బిజీగా ఉంటారు. పులుపు మామిడికాయ పచ్చడి అమోఘమైన రుచి అనడంలో సందేహం లేదు. కానీ ఈ ఊరగాయ పురుషుల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. పచ్చళ్ల వినియోగం ఎలాంటి దుష్ప్రభావాలకు దారితీస్తుందో చూద్దాం..
పురుషులు మామిడికాయ పచ్చడి తినడం మానేస్తే మంచిది. కొందరు ఇదంతా అబద్ధమే కావచ్చు అనుకుంటారు. కానీ పురుషులు సిట్రస్ పదార్థాలను నిరంతరం తీసుకుంటే వాటిని ఆపేయాలని ఒక అధ్యయనం చెబుతోంది. పచ్చళ్లను ఎక్కువగా తీసుకుంటే వారిలో లైంగిక నపుంసకత్వ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఊరగాయలను అప్పుడప్పుడు తింటే ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.. కానీ పచ్చళ్లు లేకుండా భోజనం చేయనివారిలో ఈ సమస్య తప్పకుండా వస్తుంది.
మామిడి పచ్చళ్లపై జరిపిన ఒక అధ్యయనంలో పురుషులు మామిడి పచ్చళ్లను ఎందుకు ఎక్కువగా తినకూడదో వివరిస్తుంది. మామిడి పచ్చడిలో ఎసిటామిప్రిడ్ ఉన్నట్లయితే మీకు హాని కలుగుతుంది. ఎసిటామిప్రిడ్ ఒక సేంద్రీయ సమ్మేళనం. మామిడిని వివిధ వ్యాధుల నుండి రక్షించడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల పురుషుల్లో లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతూనే ఉంటుంది.
ప్రస్తుతం రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు పండడం లేదు. మామిడి కూడా దీనికి మినహాయింపు కాదు. మామిడికాయ పచ్చడిలో కూడా రసాయనాల మిశ్రమం ఉంటుంది. ఊరగాయలు ఎక్కువ కాలం ఉండేలా రసాయనాలు వాడే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఊరగాయ వాడకుండా ఉండండి. బదులుగా తాజా చట్నీ, సలాడ్ లేదా సాస్ మొదలైన వాటి రూపంలో ఉపయోగించండి. మీ ఆహారాన్ని మెరుగుపరచండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి.
ఒక్క మామిడికాయ పచ్చడే కాదు.. ఏ పచ్చడి అయినా ఎక్కువ మెుత్తంలో తినకూడదు. రోజూ అస్సలు తీసుకోకూడదు. ఇలా తింటే జీర్ణాశయంలో మంట కూడా వస్తుంది. మీరు రెగ్యూలర్‌గా పచ్చళ్లు తింటే మీ ఛాతిలో మండినట్టుగా అనిపిస్తుంది. జీర్ణసమస్యలు వస్తాయి. శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. అందుకే పచ్చళ్లు అప్పుడప్పుడు తినండి. ఏదో యుద్ధం చేసినట్టుగా వాటిని మాత్రమే తింటూ ఉండకండి. నోటి రుచి కోసం ఎప్పుడో ఓసారి మాత్రమే తినండి.