Weightloss: బరువు తగ్గాలని తక్కువగా తింటున్నారా? అయితే ఈ ఆరోగ్యసమస్యలు రావడానికి సిద్ధంగా ఉంటాయి
Weightloss: బరువు తగ్గాలని ఎంతో మంది కోరుకుంటారు. దీని కోసం తక్కువగా తింటూ ఉంటారు. ఒక పూట పూర్తిగా తినడం మానేస్తారు. ఇలా ఆహారం తినడం మానేస్తే బరువు తగ్గే విషయం పక్కన పెడితే మరిన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
అదనపు కిలోలు తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు. తరచూ డైటింగ్ చేస్తూ ఉంటారు. రోజులో ఒక పూట మానేస్తారు. అంతేనా తినే భోజనంలో కూడా కోత విధించుకుంటారు. ఎంత తక్కువగా తింటే అంత త్వరగా బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ ఇది సురక్షితమైన పద్ధతి కాదని చెబుతున్నారు వైద్యులు. ఆహారం తగ్గించేయడం వల్ల బరువు తగ్గడమే కాదు, శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలైపోతాయి. ఆహారంలో పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే పోషకాలు తగ్గుతాయో శరీరం సరిగా పనిచేయలేదు. పోషకాహారలోపం శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం కూడా కష్టమైపతుంది. జీవక్రియ నెమ్మదిగా మారిపోతుంది. ఇది బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తుంది. శరీరానికి సరిపడినంత ఆహారం, పోషకాలు తినకపోవడం వల్ల శరీరంలో కొత్త సమస్యలు మొదలవుతాయి.
కండరాలకు నష్టం
చాలా తక్కువ కేలరీలు తినడం కండరాల నష్టానికి దారితీస్తుంది. కండర కణజాలం విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. కాబట్టి కండర ద్రవ్యరాశిని కోల్పోవడం మీ మొత్తం జీవక్రియ రేటును తగ్గిస్తుంది. జీవక్రియలో మీరు రోజంతా తక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. ఇది బరువు తగ్గడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది.
పోషక లోపాలు
ఆహారంలో కోత విధించుకోవడం వల్ల పోషకాల లేమి వస్తుంది. ఇది సాధారణ శారీరక విధులకు అంతరాయం కలిగిస్తుంది. పోషక లోపం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ముఖ్యంగా గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లు ఆకలిని హార్మోన్లు సరిగా పనిచేయవు. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఆకలి ఫీలింగ్ ను పెంచుతుంది. దీని వల్ల అతిగా తింటారు. ఇది బరువు పెరగడానికి మరింత దోహదం చేస్తుంది.
పెరిగిన కార్టిసాల్ ఉత్పత్తి
కఠినమైన డైటింగ్ మానసికంగా, భావోద్వేగంగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి బరువు పెరగడానికి సంబంధించిన కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది, ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో ఈ ప్రభావం పడుతుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు శరీరాన్ని కొవ్వును, ముఖ్యంగా బెల్లీ కొవ్వును నిల్వ చేయడానికి ప్రేరేపిస్తాయి.
థర్మోజెనిసిస్
అడాప్టివ్ థర్మోజెనిసిస్ అనేది కేలరీల తీసుకోవడం ఆధారంగా శరీరం తన శక్తి వ్యయాన్ని ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గించే ప్రక్రియ. ఇది ఆకలికి వ్యతిరేకంగా మరొక రక్షణ విధానం, కానీ ఇది బరువు తగ్గించే ప్రయత్నాలను తగ్గించగలదు.
బరువు తగ్గాలనుకుంటే ఆహారాన్ని తింటూనే ఆరోగ్యంగా బరువు తగ్గాలి. తేలికపాలి ఆహారాన్ని తినడం వల్ల కొవ్వు శరీరంలో చేరదు. ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు తినడం ద్వారా బరువు పెరగకుండా అడ్డుకోవచ్చు. తెల్ల అన్నాన్ని తగ్గించి సలాడ్లు, కప్పు పెరుగు, ఒక కప్పు పండ్ల ముక్కలు, గుప్పెడు నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట త్వరగా నిండడంతో పాటూ, పోషకాలు కూడా అందుతాయి.
టాపిక్