Eating in Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ఉంటుందట, 3వేల మందిపై చేసిన స్టడీ ఫలితాలు-eating in plastic containers increases the risk of heart disease results of a study of 3 000 people ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating In Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ఉంటుందట, 3వేల మందిపై చేసిన స్టడీ ఫలితాలు

Eating in Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ఉంటుందట, 3వేల మందిపై చేసిన స్టడీ ఫలితాలు

Ramya Sri Marka HT Telugu
Published Feb 15, 2025 02:30 PM IST

Eating in Plastic: ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. 2018లో జరిపిన ఒక అధ్యయనంలో ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల శరీరంలో బిస్ఫెనాల్-A (BPA) వంటి రసాయనాలు పెరుగుతాయని, ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయని తెలిసింది.

ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ఉంటుందట
ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ఉంటుందట (Freepik)

ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందట. గట్ బయోమ్లో మార్పుల వల్ల మంట, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు భావిస్తున్నారు. సైన్స్ డైరక్ట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ కథనంలో మరిన్ని షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి.

ఏం జరుగుతోందంటే..

ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం ఉంచడం వల్ల అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. ఇవి మనం తినే ఆహారంలో చేరి, తద్వారా పేగుల్లోకి ప్రవేశిస్తాయట. ఇది గట్ లైనింగ్‌కు శారీరక నష్టాన్ని కలిగిస్తుంది. పేగులను అనారోగ్యానికి గురి చేస్తుంది. దీని ఫలితంగా హానికరమైన కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రసరణ వ్యవస్థను దెబ్బతీసే విధంగా డీ హైడ్రేటింగ్ కు దారి తీస్తాయి. ఆ విధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెరుగుతుంది.

అధ్యయనం గురించి పరిశోధకులు చెప్పిన దానిని బట్టి చాలా మంది దాదాపు గుండె ఆగిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్నారట. చైనాలో 3,000 మందిపై ఈ పరిశోధన జరిపారు. వారిలో ప్లాస్టిక్ టేకౌట్ కంటైనర్ల నుండి తినే అలవాటు, గతంలో గుండె జబ్బుల ఉన్నాయా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరిపారు. ఆ తర్వాత ప్లాస్టిక్ రసాయనాలు వెలువడేలా చేయగల మరిగించిన నీటిని క్యారీఅవుట్ కంటైనర్లలో పోశారు. అందులో ఎలుకలను వదిలిపెట్టారు. ఆ పరిస్థితుల్లో వాటిల్లో కలిగిన మార్పులు, నీటిలో ప్లాస్టిక్ విడుదలయ్యే అధిక ఫ్రీక్వెన్సీ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని గణనీయంగా పెంచినట్లు కనుగొన్నారు.

కొత్త స్టడీలో రీసెర్చర్లు, ప్లాస్టిక్ నుండి కచ్చితంగా ఏయే రసాయనాలు లీక్ అవుతున్నాయో కన్ఫమ్ చేయనప్పటికీ, సాధారణ ప్లాస్టిక్ సమ్మేళనాలు, గుండె జబ్బుల మధ్య సంబంధాన్ని, గట్ బయోమ్ - గుండె జబ్బుల మధ్య మునుపటి సంబంధాన్ని గుర్తించారు.

ప్రమాదం రాకుండా ఉండాలంటే, మనం ఏం చేయగలం?

ఆహార కంటైనర్ల నుండి మైక్రోప్లాస్టిక్స్ విడుదల కావడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలను ఎలా తగ్గించుకోవచ్చు? ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు ఇంకొన్ని చిట్కాలను ఇక్కడ పరిశీలిద్దాం.

  • ఆహార పదార్థాల విషయంలో గ్లాస్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే ఎంచుకోండి. సాధ్యమైనంత వరకూ ప్లాస్టిక్‌తో తయారు కాని వస్తువులలో మాత్రమే లేదా కంటైనర్లలో మాత్రమే ఫుడ్ ఐటెంలను స్టోర్ చేసుకోండి.
  • ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేయడం మానుకోండి. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారంలో ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ కలిసి పోతాయి.
  • ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంటైనర్లను ఉపయోగించే రెస్టారెంట్లను మాత్రమే ఎంచుకోండి. సుస్థిరతకు ప్రాధాన్యత ఇచ్చే, బయోడీగ్రేడబుల్ లేదా నాన్ ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించే రెస్టారెంట్లను సపోర్ట్ చేయండి.
  • కేవలం ఆహారం విషయంలోనే కాదు, చిన్న చిన్న పనులకు కూడా ప్లాస్టిక్ వినియోగించాల్సిన అవసరం లేదని గుర్తించి, మెటల్ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం