ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందట. గట్ బయోమ్లో మార్పుల వల్ల మంట, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు భావిస్తున్నారు. సైన్స్ డైరక్ట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ కథనంలో మరిన్ని షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి.
ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం ఉంచడం వల్ల అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. ఇవి మనం తినే ఆహారంలో చేరి, తద్వారా పేగుల్లోకి ప్రవేశిస్తాయట. ఇది గట్ లైనింగ్‌కు శారీరక నష్టాన్ని కలిగిస్తుంది. పేగులను అనారోగ్యానికి గురి చేస్తుంది. దీని ఫలితంగా హానికరమైన కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రసరణ వ్యవస్థను దెబ్బతీసే విధంగా డీ హైడ్రేటింగ్ కు దారి తీస్తాయి. ఆ విధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెరుగుతుంది.
అధ్యయనం గురించి పరిశోధకులు చెప్పిన దానిని బట్టి చాలా మంది దాదాపు గుండె ఆగిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్నారట. చైనాలో 3,000 మందిపై ఈ పరిశోధన జరిపారు. వారిలో ప్లాస్టిక్ టేకౌట్ కంటైనర్ల నుండి తినే అలవాటు, గతంలో గుండె జబ్బుల ఉన్నాయా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరిపారు. ఆ తర్వాత ప్లాస్టిక్ రసాయనాలు వెలువడేలా చేయగల మరిగించిన నీటిని క్యారీఅవుట్ కంటైనర్లలో పోశారు. అందులో ఎలుకలను వదిలిపెట్టారు. ఆ పరిస్థితుల్లో వాటిల్లో కలిగిన మార్పులు, నీటిలో ప్లాస్టిక్ విడుదలయ్యే అధిక ఫ్రీక్వెన్సీ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని గణనీయంగా పెంచినట్లు కనుగొన్నారు.
కొత్త స్టడీలో రీసెర్చర్లు, ప్లాస్టిక్ నుండి కచ్చితంగా ఏయే రసాయనాలు లీక్ అవుతున్నాయో కన్ఫమ్ చేయనప్పటికీ, సాధారణ ప్లాస్టిక్ సమ్మేళనాలు, గుండె జబ్బుల మధ్య సంబంధాన్ని, గట్ బయోమ్ - గుండె జబ్బుల మధ్య మునుపటి సంబంధాన్ని గుర్తించారు.
ఆహార కంటైనర్ల నుండి మైక్రోప్లాస్టిక్స్ విడుదల కావడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలను ఎలా తగ్గించుకోవచ్చు? ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు ఇంకొన్ని చిట్కాలను ఇక్కడ పరిశీలిద్దాం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం