కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థం.
కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వెల్లుల్లి చట్నీ తయారు చేసుకోండి. దీని తరచూ తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చాలా వరకు కరిగిపోతుంది.
వెల్లుల్లి రెబ్బలు - పది
జీలకర్ర - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - ఒక స్పూను
పచ్చిమిర్చి - మూడు
1. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
4. దాంట్లోనే నిమ్మ రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
6. ఆ నూనెలోనే జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించాలి.
7. దీన్ని చట్నీపై వేసుకోవాలి. నూనెను తక్కువగా వాడాలి.
8. ఈ చట్నీని ఒకసారి తయారు చేసుకుని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకుంటే వారం రోజులు పాటు తినవచ్చు.
వెల్లుల్లి ఆయుర్వేదంలో కూడా ఔషధ గుణాలతో నిండిన పదార్థంగా చెప్పుకుంటారు. దీనిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు ఎంతో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి వెల్లుల్లి ఎంతో అవసరం.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు... రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి చట్నీని తరచూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అవి సవ్యంగా స్రవించి ఆహారం జీర్ణం అవుతుంది. వెల్లుల్లి చట్నీని తినడం వల్ల మీకు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు శరీరంలో చేరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.