డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నట్స్ చాలా ముఖ్యమైనవి. వీటిలో ఉండే పోషకాలు రోజంతా శక్తిని అందిస్తూ, వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినా డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి వేడి చేస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా తినాలి.
వేసవిలో డ్రైఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి ఎండల్లో పిల్లలకు ఎన్ని డ్రైఫ్రూట్స్, నట్స్ పెట్టాలో ప్రతి తల్లి తెలుసుకోవాలి. పిల్లల వయసును బట్టి వారికి వేసవిలో నట్స్ తినిపించాలి.
బాదం పప్పులు : రెండు
జీడిపప్పు: ఒకటి
వాల్ నట్స్: అర ముక్క
కిస్ మిస్‌లు - నాలుగు
ఖర్జూరం - ఒకటి
బాదం పప్పులు - మూడు
జీడిపప్పులు : మూడు
వాల్ నట్స్: ఒకటి
పిస్తా పప్పు: నాలుగు
కిస్ మిస్: పది
ఖర్జూరాలు: రెండు
పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లలకు నట్స్ తినిపించడం వల్ల వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తినిపిస్తే చాలు వారి మెదడు అద్భుతంగా పనిచేస్తుంది.
బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని తినడం వల్ల పిల్లలకు కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా నట్స్ ఉపయోగపడతాయి. కొన్నింటిలో సెలీనియం, విటమిన్ ఇ ఉంటుంది. ఇవి పిల్లలకు ఎంతో అత్యవసరమైనవి.
నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పిల్లల జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. వారి ఆరోగ్యానికి ఫైబర్ ముఖ్యం.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం