Empty Stomach: ప్రతిరోజూ ఖాళీ పొట్టతో ఈ ఆకులను నమలండి చాలు, జుట్టు రాలడం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యల వరకు అన్నీ దూరం-eating curry leaves daily on an empty stomach can reduce hair loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Empty Stomach: ప్రతిరోజూ ఖాళీ పొట్టతో ఈ ఆకులను నమలండి చాలు, జుట్టు రాలడం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యల వరకు అన్నీ దూరం

Empty Stomach: ప్రతిరోజూ ఖాళీ పొట్టతో ఈ ఆకులను నమలండి చాలు, జుట్టు రాలడం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యల వరకు అన్నీ దూరం

Haritha Chappa HT Telugu
Jun 26, 2024 02:30 PM IST

Empty Stomach: ఖాళీ పొట్టతో తినే ఆహారం ఎంతో ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీపొట్టతో గుప్పెడు కరివేపాకులను నమిలి మింగండి. కేవలం రెండు వారాల్లోనే మీకు ఎన్నో ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఖాళీ పొట్టతో కరివేపాకులను తింటే ఏమవుతుంది?
ఖాళీ పొట్టతో కరివేపాకులను తింటే ఏమవుతుంది? (Unsplash)

Empty Stomach: ప్రాచీన కాలం నుండి కరివేపాకును భారతీయ వంటకాలలో భాగం చేసుకున్నాము. అంతేకాదు ఔషధాల తయారీలో ఈ కరివేపాకులను వినియోగించడం మొదలుపెట్టాము. వీటిలో ఉన్న ఔషధ గుణాల వల్ల కరివేపాకులను ప్రతిరోజూ తినమని చెబుతారు. ఖాళీపొట్టతో కరివేపాకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడం దగ్గర నుంచి జుట్టును పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజు కరివేపాకులను ఖాళీ పొట్టతో నమిలి ఆ రసాన్ని మింగండి.

జుట్టు రాలకుండా...

జుట్టు రాలే సమస్య ఇప్పుడు యువతలో పెరిగిపోయింది. ఆ సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ ఖాళీ పొట్టతో ఉదయాన కరివేపాకులను నమిలి ఆ రసాన్ని మింగితే ఎంతో మంచిది. దీనిలో బీటా కెరాటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లను గట్టిగా మారుస్తాయి. వాటికి పోషణను అందిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కరివేపాకులు తినడం మొదలుపెట్టిన రెండు వారాల్లోనే మీకు జుట్టు పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది.

కరివేపాకులను తినడం వల్ల కాలేయ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా రక్షిస్తాయి. శరీరాన్ని డిటాక్సిఫికేషన్‌కు గురిచేస్తాయి. దీనివల్ల శరీరంలో ఉన్న వ్యర్ధాలు, విషాలు బయటకు పోతాయి.

డయాబెటిస్ ఉన్నవారు

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కరివేపాకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఖాళీపొట్టతో ఇలా కరివేపాకులను తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. కరివేపాకుల్లో జీవక్రియను పెంచే బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు. జీవక్రియ రేటు సజావుగా ఉంటుంది. కాబట్టి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

నోటి దుర్వాసన తగ్గేందుకు

నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య ఎక్కువే. నోరు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి బ్యాక్టీరియాలు నోట్లో చేరవు. కరివేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది నోటి బాక్టీరియాను పెరగకుండా అడ్డుకుంటుంది. ప్రతిరోజూ పరగడుపున ఇలా కరివేపాకులను నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.

కరివేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ అదుపులో ఉంటే ఎన్నో రకాల రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. కాబట్టి కరివేపాకులను ప్రతిరోజూ ఖాళీ పొట్టతో తినడం చాలా అవసరం.

కరివేపాకులను శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమలవచ్చు. వీటిని వంటల్లో భాగం చేసుకోవాలి. కూరలోంచి కరివేపాకులు ఏరి పడేయకుండా వాటిని నమిలేయాలి. కరివేపాకుల టీ చేసుకుని తాగాలి. ఇలా కరివేపాకులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

WhatsApp channel