కీరదోసను పొరపాటున కూడా ఈ 5 పదార్థాలతో కలిపి తినకండి! జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడతారు-eating cucumber with these ingredients can cause health problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కీరదోసను పొరపాటున కూడా ఈ 5 పదార్థాలతో కలిపి తినకండి! జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడతారు

కీరదోసను పొరపాటున కూడా ఈ 5 పదార్థాలతో కలిపి తినకండి! జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడతారు

Ramya Sri Marka HT Telugu

వేసవిలో దోసకాయలు తినడం ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే వీటిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరమట. దోసకాయలతో కలపి తినకూడని 5 రకాల పదార్థాల గురించి తెలుసుకుందాం రండి.

కీరదోసతో కలిపి తినకూడని పదార్థాలు (Shutterstock)

ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే కీరదోసకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ముఖ్యంగా వేసవిలో నీటితో నిండిన దోసకాయలు చాలా చల్లగా, రుచిగా ఉంటాయి. వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బయట వేడితో పాటు శరీరంలోని వేడిని కూడా తీసిపడేస్తాయి. అందుకే దీన్ని వివిధ రకాలుగా తమ ఆహారంలో చేర్చుకుంటారు. సలాడ్లు, రైతాలతో పాటు సాండ్‌విచ్, పిజ్జా వంటి వాటిల్లో ఫిల్లింగ్‌గా కూడా దోసయకాయను వాడుతుంటారు.

నిజానికి కీరదోసకాయలను తినడం చాలా ప్రయోజనకరమైనది. కానీ కొన్నిసార్లు వీటిని తినే విధానం లాభాలకు బదులుగా నష్టాలను తెచ్చిపెడుతుందని మీకు తెలుసా. వీటిని ఇతర పదార్థాలతో కలిపి తినేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఇదనే కాదు చాలా రకాల ఆహార పదార్థాలను ఇతర పదార్థాలతో కలిపి తినడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతన్నారు. రెండు భిన్నమైన ఆహార పదార్థాల సంయోగం హానికారకంగా మారుతుంది. ఈ వేసవిలో దోసకాయలు పుష్కలంగా తినేవారు వీటితో కలిపి తినకూడని 5 రకాల పదార్థాల గురించి తప్పక తెలుసుకోవాలి.

దోసకాయతో కలిపి తినకూడని ఆహారాలు..

1. టమాటో, కీరదోసకాయ కలిపి తినకండి

ఎక్కువ మంది సలాడ్‌ చేసుకున్నప్పుడు దాంట్లో కీరదోసకాయలు, టమాటోలు రెండింటినీ కలిపి తింటారు. మీ దృష్టిలో ఇది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ఎంపిక అయినప్పటికీ, నిజానికి ఇది మీ ఆరోగ్యానికి హాని చేసే కలయిక. ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. నిజానికి, రెండింటి సంయోగం మీ కడుపు పీహెచ్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల మీ సలాడ్ రుచి కూడా పెద్దగా బాగుండదు.

2. పాలు/పెరుగుతో కీరదోస కలిపి తినకూడదు

వేసవిలో మీరు కీరదోసకాయలతో రైతా చేసుకునే వారు చాలా మంది ఉంటారు. దీన్ని ఇష్టపడే వారికి ఇదొక చేదు వార్తే అనుకోవాలి. రైతాలో కీరదోస ముక్కలు వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి కీరదోసకాయలను ఏ రకమైన డైరీ ఉత్పత్తులతోనూ అంటే పాలు లేదా పాలతో తయారైన ఏ వస్తువులతోనూ కలిపి తినకూడదు. ఈ రెండింటి సంయోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జనలో అడ్డంకులు, జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

3. కీరదోసకాయలతో ముల్లంగి తినకండి

సలాడ్‌లో కీరదోసకాయలు, ముల్లంగిల జంట చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ రెండూ నీటితో నిండి ఉంటాయి. అలాగే వీటి స్వభావం చాలా చల్లగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో అజీర్ణం, గ్యాస్, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఈ రెండూ కలిసి ప్రతిస్పందిస్తాయి. దీనివల్ల శరీరం విటమిన్ సి సరిగ్గా గ్రహించలేకపోతుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

4. పుల్లని పండ్లతో కీరదోస తినకండి

చాలా మంది కీరదోసపై నిమ్మకాయ వేసి తింటారు. మరికొందరు పండ్ల చాట్‌లో అంటే నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో కీరదోస ముక్కలను కూడా వేసి తింటుంటారు. అయితే ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పుల్లటి పండ్లతో కీరదోస కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. రుచిలో కూడా మార్పులు వస్తాయి. తినడానికి అంతగా బాగోవు.

5. మాంసంతో కలిపి దోసకాయలు తినకండి

మీరు ఏదైనా మాంసాహారం తింటున్నట్లయితే దానితో దోసకాయలు తినడం మానుకోండి. నిజానికి, ఈ రెండు ఆహారాలు ఒకదానికొకటి వ్యతిరేకం. కీరదోస సులభంగా జీర్ణం అవుతాయి, మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి కసీనం 8 గంటలు పట్టవచ్చు. అంతేకాకుండా, కీరదోసకాయలు ఫైబర్, నీటితో నిండి ఉంటాయి. మాంసం చాలా భారీ ప్రోటీన్, కొవ్వుతో నిండి ఉంటుంది. ఈ విరుద్ధత కారణంగా మాంసం, కీరదోసకాయలను కలిపి తినడం వల్ల అజీర్ణం, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం