Apples: నెలరోజుల పాటూ బ్రేక్ ఫాస్ట్ గా రెండు ఆపిల్స్ తిని చూడండి, మీలో మార్పులు వస్తాయి
Apples: ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అదేవిధంగా ప్రతిరోజూ అల్పాహారంగా ఆపిల్ తినడం వల్ల శరీరానికి, చర్మానికి కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? బరువు తగ్గడం నుండి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆపిల్ పండ్లను ఆరోగ్యానికి ఔషధంగా చెప్పుకుంటారు. రోజుకో ఆపిల్ పండు తింటే చాలు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదని చెప్పుకుంటారు. అది నిజమేనని ఎన్నో అధ్యయనాలు కూడా తేల్చాయి. మన రోగనిరోధక శక్తిని బలపరిచే విటమిన్ సి ఆపిల్ పండులో పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. నెల రోజుల పాటు ప్రతిరోజూ అల్పాహారంగా ఆపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఆపిల్ తింటే…
ఆపిల్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. తద్వారా మీకు మళ్లీ మళ్లీ ఏదైనా తినాలన్న కోరిక ఉండదు. దీని వల్ల మీరు అధిక కేలరీలు తీసుకోరు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కేలరీలు తక్కువ: ఆపిల్ లో తక్కువ క్యాలరీ కంటెంట్ ఉంటుంది. మీరు ఎటువంటి ఆందోళన లేకుండా మీ రోజువారీ అల్పాహారంలో ఆపిల్స్ ను తినవచ్చు.
మెటబాలిజంను పెంచుతుంది: ఆపిల్ లో ఉండే కొన్ని పదార్థాలు మీ మెటబాలిజంను పెంచడానికి సహాయపడతాయి. ఇది మీ శరీరం కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది, దీనివల్ల మీరు బరువు తగ్గుతారు.
బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది: ఆపిల్ శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మధుమేహం ఉన్నవారు ఆపిల్ తింటే ఎంతో ఆరోగ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఆపిల్స్ లో ఉండే కరిగే ఫైబర్ పెక్టిన్ మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్) ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది: ఆపిల్స్ లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
హార్ట్ ఎటాక్ నివారణ: యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండెను డ్యామేజ్ చేసి హార్ట్ ఎటాక్ రిస్క్ ను తగ్గిస్తాయి.
ఒక నెలలో ఎలాంటి మార్పులను గమనించవచ్చు?
- క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల నెలలో కొన్ని కిలోల వరకు బరువు తగ్గవచ్చు.
- యాపిల్స్ లో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్దకాన్ని నివారిస్తుంది.
- యాపిల్స్ లో ఉండే నేచురల్ షుగర్ రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
- యాపిల్స్ లో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
ఉదయాన్నే పరగడుపున ఒక ఆపిల్ తినడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆపిల్ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొక్కతోనే ఆపిల్ పండు తినండి. మీరు ఆపిల్ పండ్లను ఇతర పండ్లతో మిక్స్ చేసి తినవచ్చు. సలాడ్ లో ఆపిల్స్ ను జోడించవచ్చు. ఆపిల్ తినడానికి ముందు బాగా శుభ్రపరచుకోవాలి.