భార్యాభర్తల మధ్య ప్రత్యేక బంధం ఉండటం కూడా చాలా ముఖ్యం. మానసికంగా, శారీరకంగా ఒకరికొకరు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ బంధం బలపడుతుంది. మానసికంగా సంతృప్తి చెందడానికి భావోద్వేగ అనుబంధం అవసరం అయితే, శారీరకంగా సంతృప్తి చెందడానికి ఇద్దరి శారీరక అవసరం తీరడం చాలా ముఖ్యం. అయితే, కొన్నిసార్లు శరీరంలో పోషక లేమి వల్ల సాన్నిహిత్యం సమయంలో ఒక భాగస్వామి మరొకరికి కావాల్సని సంతృప్తి ఇవ్వలేరు. దీనివల్ల భార్యాభర్తల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్య రాకుండా సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. లైంగిక కలయిక మీద ఆసక్తి, సామర్థ్యం మెరుగుపరచే ఆహారాలు తినాల్సిందే.
బాదం పప్పులో విటమిన్లు, మినరల్స్ తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. బాదం తినడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతుంది. దీనితో పాటు, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. బాదాంలో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మీ శృంగార సామర్థ్యాన్ని, మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
డార్క్ చాకోలేట్ తీసుకోవడం వల్ల కూడా శృంగారం మీద ఆసక్తి, సామర్థ్యం మెరుగవుతాయి. డార్క్ చాక్లెట్లో అర్జినిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. మహిళల్లో కూడా లైంగిక సంబంధిత అనారోగ్య సమస్యలను తగ్గించడానికి పనిచేస్తుంది.
సంతానోత్పత్తి, శారీరక సామర్థ్యం సమస్యను తొలగించడానికి గుడ్లు సాయపడతాయి. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. దీనితో పాటు గుడ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.
ఎనర్జీ లెవల్స్ పెంచడానికి అరటిపండు పనిచేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. మెగ్నీషియం కూడా అరటి పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల కలయిక మీద ఆసక్తి, సమార్థ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే అరటిపండు, పాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరచడానికి స్ట్రాబెర్రీలను కూడా తినవచ్చు. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మనసు రిలాక్స్ అవుతుంది. ఇది సెక్స్ డ్రైవ్ పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పడుకునే సమయం కూడా మెరుగుపడుతుంది.