Blood Purifying Foods। చెడు రక్తంతో సమస్యలు అనేకం, ఈ ఆహారాలతో మీ రక్తం శుద్ధి అవుతుంది!
Blood Purifying Foods: కొన్ని ఆహార పదార్థాలలోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి. రక్తం శుద్ధి కావాలనుకుంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Blood Purifying Foods: శరీరం అంతటా రక్త ప్రసరణ సక్రమంగా జరిగినప్పుడే, శరీరంలోని అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ కారణంగానే శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలు అవసరమైన పోషణను పొందుతాయి. రక్తంలో కరిగిన ఆక్సిజన్ శరీర అవయవాలకు కొవ్వు, హార్మోన్లు, చక్కెర వంటి అన్ని పోషకాలను చేరవేస్తుంది. కానీ సరైన ఆహారం తీసుకోనపుడు, అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా రక్తంలో మలినాలు పేరుకుపోయి, రక్తం అపరిశుభ్రం అవుతుంది. ఈ అపరిశుభ్రమైన రక్తం శరీరంలోని అవయవాలకు చేరుతున్నప్పుడు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
చెడు రక్తం వల్ల చర్మంలో అలర్జీ, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే ఈ చెడు రక్తం గుండె, కాలేయం, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలకు చేరుతున్నప్పుడు తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని ఆహార పదార్థాలలోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి. రక్తం శుద్ధి కావాలనుకుంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
బెల్లం
బెల్లం సహజంగా శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల విషపదార్థాలన్నీ బయటకు వస్తాయి. బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువ. దీని వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక బెల్లం తింటే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మలబద్ధకం నివారించడం, కాలేయం సక్రమంగా పనిచేయడానికి కూడా బెల్లం సహాయపడుతుంది.
బీట్‌రూట్
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో కొత్త రక్తం అందుతుంది. అలాగే ఇందులో ఉండే బీటాసైనిన్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను సలాడ్‌గా కూడా తినవచ్చు. బీట్‌రూట్ ఏ రూపంలో తీసుకున్నా, శరీరానికి, చర్మానికి చాలా విధాల ప్రయోజనం కలుగుతుంది.
పసుపు
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం యాంటీ బ్యాక్టీరియల్. ఇది శరీరంలో హానికర బ్యాక్టీరియాను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పసుపు పాలు లేదా పసుపును నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
తులసి
రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి టీ కూడా తాగవచ్చు. తులసి ఆకులలో చాలా ఆక్సిజన్ ఉంటుంది, ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఈ రకంగా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
వేప ఆకులు
రక్తం మలినమవడం కారణంగా ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి. చర్మం దురద పెడుతుంది, దద్దుర్లు వస్తాయి. ఇటువంటప్పుడు రోజూ ఖాళీ కడుపుతో కొన్ని వేప ఆకులను నమలడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్ రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది.
సంబంధిత కథనం