Mixed Sprouts Tikki: అల్పాహారంలోకి మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీ.. సులభంగా తయారు..-easy mixed sprouts tikki recipe for healthy breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mixed Sprouts Tikki: అల్పాహారంలోకి మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీ.. సులభంగా తయారు..

Mixed Sprouts Tikki: అల్పాహారంలోకి మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీ.. సులభంగా తయారు..

Koutik Pranaya Sree HT Telugu
Oct 23, 2023 06:30 AM IST

Mixed Sprouts Tikki: అన్ని రకాల మొలకలు కలిపి చేసిన మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీ
మిక్స్డ్ స్ప్రౌట్స్ టిక్కీ (https://creativecommons.org/licenses/by-sa/4.0)

ఉదయాన్నే అల్పాహారంలోకి మొలకలతో చేసిన టిక్కీలు తింటే ఆరోగ్యకరం. వీటిలోకి మొలకల్ని ఉడికించుకుని వాడొచ్చు. లేదా పచ్చి మొలకల్ని కూడా వేసుకోవచ్చు. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు:

3 బంగాళదుంపలు, ఉడికించినవి

1 చెంచా మొలకెత్తిన పెసర్లు

1 చెంచా బటానీ

1 చెంచా ఉడికించిన శనగలు

తగినంత ఉప్పు

1 చెంచా కారం

పావు చెంచా పసుపు

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

కొద్దిగా కొత్తిమీర

నూనె కొద్దిగా

తయారీ విధానం:

  1. ముందుగా అన్ని మొలకెత్తిన గింజల్ని కుక్కర్లో లేదా ఆవిరి మీద ఉడికించుకోవాలి.
  2. ఒక గిన్నెలో ఈ ఉడికించిన గింజల్ని తీసుకోవాలి. అందులో బంగాళదుంపల్ని బాగా మెదుపుకుని కలుపుకోవాలి.
  3. దీంట్లోనే నూనె తప్ప మిగతా మసాలాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చేతి మధ్యలో కాస్త వెడల్పాటి ప్యాటీల్లాగా ఒత్తుకోవాలి.
  5. ఇప్పుడు ఒక నాన్‌స్టిక్ ప్యాన్ తీసుకుని నూనె వేసుకోవాలి. వాటిలో ఒత్తుకున్న టిక్కీలను అంతటా సర్దుకోవాలి. రెండు వైపులా కొద్దిగా నూనె వేసుకుని వేయించుకోవాలి.
  6. వీటిని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.

WhatsApp channel