Dementia Signs | బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆబ్సెంట్, ఈ సంకేతాలు కనిపిస్తున్నాయంటే అది ఇదే!-early signs and symptoms of dementia you should never ignore ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Early Signs And Symptoms Of Dementia You Should Never Ignore

Dementia Signs | బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆబ్సెంట్, ఈ సంకేతాలు కనిపిస్తున్నాయంటే అది ఇదే!

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 09:03 AM IST

Dementia Signs: డెమెన్షియా అనేది నిర్దిష్ట వ్యాధి కాదు, కానీ ఈ సమస్య ఉన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. స్పష్టంగా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏ విషయాలను గుర్తుంచుకోలేకపోవడం, మనుషులను సైతం గుర్తు పట్టకపోవడం ఉంటాయి.

Dementia Signs:
Dementia Signs: (istock)

Dementia Signs: చిత్తవైకల్యం లేదా చిత్తభ్రంశం అనేది మెదడు పనితీరు సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బతీసే ఒక మానసిక రుగ్మత. నిజానికి డెమెన్షియా అనేది నిర్దిష్ట వ్యాధి కాదు, కానీ ఈ సమస్య ఉన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. స్పష్టంగా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏ విషయాలను గుర్తుంచుకోలేకపోవడం, మనుషులను సైతం గుర్తు పట్టకపోవడం ఉంటాయి. సాధారణంగా వృద్ధాప్యంలో ఇలాంటి సమస్యలు రావడం సహజం, కానీ నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఏ వయసులో వారికైనా చిత్తవైకల్యం సంభవించవచ్చు.

డిప్రెషన్, అతిగా మద్యం సేవించడం, స్మోకింగ్ చేయడం, పోషకాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, డయాబెటీస్, స్టోక్, గుండె సంబంధిత వ్యాధులు, తలకు గాయం మొదలైన పరిస్థితుల కారణంగా చిత్తవైకల్యం ఏర్పడవచ్చు. ఇది అల్జీమర్స్ వ్యాధికి అత్యంత సాధారణ రకం.

డిమెన్షియా అనేది ఒక మానసిక వైకల్యం, దీనితో బాధపడేవారిలో జ్ఞాపకశక్తి, తెలివితేటలు క్షీణిస్తాయి, శారీరకంగానూ బలహీనపడతారు ఏ వ్యక్తికైనా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంకేతాలు ఇలా ఉండవచ్చు.

స్వల్పకాలిక మతిమరుపు

మతిమరుపు అనేది చిత్తవైకల్యం ఆగమనానికి అత్యంత సాధారణ సంకేతం, తరచుగా మతిమరుపుతో ఇబ్బంది పడతారు. ఉదాహరణకు తాళం చెవులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం, ఆ రోజు భోజనం ఏం చేశారో మరిచిపోవడం వంటి సంకేతాలు ఉంటాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూ ఉంటే అది చిత్తవైకల్యంకు ముందస్తు హెచ్చరికగా ఉండవచ్చు.

ఆసక్తి కోల్పోవడం

చిత్తవైకల్యం మరొక సంకేతం గతంలో ఆనందించే కార్యకలాపాలపై సాధారణ ఆసక్తిని కోల్పోవడం. ఈ పరిస్థితి ఆలోచనలను, జ్ఞాపకశక్తిని ప్రభావితం ప్రభావితం చేస్తుంది కాబట్టి, తాము ఇష్టపడే వాటిపై కూడా ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. వాటి గురించి పెద్దగా పట్టించుకోరు.

ఏకాగ్రత లోపించడం

వ్యక్తి దేనిపై సరైన శ్రద్ధ పెట్టలేరు, వారిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఇది వారి పనితీరును దెబ్బతీస్తుంది. ఉత్పాదక తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపించడం అనేది చాలా బాధకరమైన అంశం. మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానంతో ఏకాగ్రతను సాధించే ప్రయత్నం చేయండి.

అనాలోచిత నిర్ణయాలు

చిత్తవైకల్యం ఉన్నప్పుడు ఆలోచనలు సరిగ్గా ఉండవు, అనాలోచిత నిర్ణయాలతో సమస్యలను సృష్టించవచ్చు. కొన్నిసార్లు విషయాలు ఆందోళన కలిగించవచ్చు.

మూడ్ స్వింగ్స్

చిత్తవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఒక స్థిరమైన మానసిక స్థితిని కలిగి ఉండలేరు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. వారి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం