మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు గుండెపోటు వచ్చే అవకాశముంది..-early signs and symptoms for heart attack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Early Signs And Symptoms For Heart Attack

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు గుండెపోటు వచ్చే అవకాశముంది..

HT Telugu Desk HT Telugu
May 14, 2022 11:49 AM IST

మీ గుండెకు.. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని సరఫరా చేసే కొరోనరీ ధమనుల లోపల ప్లేక్ అనే మైనపు పదార్థం ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) గుండెపోటుకు ప్రధాన కారణం. అయితే హార్ట్ ఎటాక్​ ముందుకు గుండె సంకేతాలు ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుని జాగ్రత్తగా ఉందాం.

గుండెపోటు
గుండెపోటు

Heart Attack Early Signs | కొన్నిసార్లు ఒక వ్యక్తి తనకు తెలియకుండానే గుండెపోటుకు గురవుతాడు. అప్పుడు వారికి అవసరమైన అత్యవసర వైద్య సంరక్షణను తీసుకోకపోవచ్చు. అది శాశ్వతంగా గుండెకు హాని కలిగించవచ్చు అని డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే గుండెపోటుకు కూడా ప్రారంభ సంకేతాలు, లక్షణాలు ఉంటాయని తెలిపారు. వాటి ద్వారా గుండెపోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.

ఒత్తిడి, నొప్పి లేదా మీ మెడ, దవడ లేదా వీపుపైకి వ్యాపించే మీ ఛాతీ లేదా చేతుల్లో ఒత్తిడి లేదా నొప్పి ఉంటే అది హార్ట్​ ఎటాక్​ రావడానికి ముందు ఇచ్చే హెచ్చరిక లాంటింది. ఇవి సాంప్రదాయ లక్షణాల వలె కనిపించకపోయినా.. వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లేదా కడుపు నొప్పి కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చు.

ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చల్లని చెమట, అలసట, తలతిరగడం లేదా ఆకస్మిక మైకము గుండెపోటును సూచిస్తాయి. అధిక రక్తంలో చక్కెర లేదా మధుమేహం ఉన్నవారికి పెరిఫెరల్ న్యూరోపతి కారణంగా తీవ్రమైన అడ్డంకులు ఉన్నప్పటికీ ఛాతీ నొప్పి ఉండకపోవచ్చు. గుండెపోటు సంకేతాలు, లక్షణాలు అకస్మాత్తుగా అభివృద్ధి చెందుతాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త ఉండాల్సిందే.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్