Ear Massage: చెవులకు మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా! నాడీ వ్యవస్థ నుంచి తలనొప్పి వరకూ అన్నీ హాంఫట్!
Ear Massage: బాడీ మసాజ్ వల్ల ప్రశాంతత దొరుకుతుందని తెలుసు. కానీ, చెవులకు మసాజ్ చేయడం వల్ల ఏ లాభం చేకూరుతుందో తెలుసా. రోజూ చెవులకు మసాజ్ చేయడం వల్ల వినికిడి శక్తి పెరగడంతో పాటు మెదడుకు సంబంధించిన కీలక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
చెవి మసాజ్ వినడానికి కాస్త కొత్తగా అనిపించొచ్చు. కానీ, మీకు తెలిసిన బాడీ మసాజ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలను చెవి మసాజ్ ద్వారా పొందొచ్చు. ఇంకొక విషయమేమిటంటే, బాడీ మసాజ్ వేరొక వ్యక్తి అవసరం ఉంటుంది. కానీ, చెవి మసాజ్ మీకు మీరే చేసుకోవచ్చు. మెదడుకు దగ్గరగా ఉండే చెవి భాగంలో మసాజ్ చేయడం వల్ల ప్రధాన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
రోజూ చెవుల చుట్టూ వేళ్ల సాయంతో మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొందరిలో చెవిలో ఈలలు వేసినట్లుగా వినిపించడం, గుయ్ మని సౌండ్ వినిపించడం, తరచుగా తలనొప్పి రావడం వంటివి జరుగుతాయి. అలాంటి వారు చెవి మసాజ్ తో వీటిన్నిటికీ చెక్ పెట్టొచ్చు. నాడీ వ్యవస్థ నుంచి తలనొప్పి వరకూ సమసిపోయే అనేక సమస్యల గురించి తెలుసుకుందాం.
నాడీ వ్యవస్థ పనితీరు:
చెవి చుట్టూ ఉన్న ప్రాంతంపై సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చూపుడు వేలు, మధ్య వేలి సహాయంతో ‘వి’ అనేక ఆకారంలో తయారు చేసి రెండు చెవుల మధ్యకు జొప్పించండి. అలా పదేపదే చేస్తూ సున్నితంగా రుద్దుకుంటూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చెవి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉద్దీపన పెరిగి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శబ్దాల నుంచి ఉపశమనం:
ఒకరి చెవిలో నిరంతరం ఈలల శబ్దం ఉంటే, ప్రత్యేకమైన శబ్దాలు వినిపిస్తూ మిమ్మల్ని పదేపదే ఇబ్బంది పెడుతుంటే కూడా ఈ మసాజ్ చక్కటి సొల్యూషన్. చేతులతో చెవిపై మృదువుగా మసాజ్ చేయండి. రోజూ చేయడం వల్ల చెవుల్లో ఈలల శబ్దం తగ్గడంతో పాటు వినికిడి శక్తి పెరుగుతుంది.
రిలాక్సేషన్ అందిస్తుంది:
చెవిలో అనేక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. వాటిని నొక్కడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే ఆందోళన, ఒత్తిడి వంటి చెడు ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మానసిక శాంతిని అందిస్తుంది.
బద్ధకం, అలసటలకు చెక్
బద్ధకంగా, అలసటగా అనిపించినప్పుడు కాఫీ తాగడం కాదు. ఈ సారి చెవి మసాజ్ ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చెవి మసాజ్ చేయడం వల్ల బద్ధకం, అలసట వంటి సమస్యలు క్రమంగా దూరమవుతాయి.
తలనొప్పి దూరమవుతుంది:
తరచూ తలనొప్పితో బాధపడే వారికి కూడా చెవి మసాజ్ చక్కటి రిలీఫ్ ను ఇస్తుంది. ప్రతిరోజూ రెండు చెవులను 5 నుంచి 10 నిమిషాల వరకూ మసాజ్ చేసుకున్నారంటే, నరాలు రిలాక్స్ అయి క్రమంగా తలనొప్పి సమస్య దూరమవుతుంది.
ఉల్లాసంగా ఉండగలుగుతారు:
చెవులకు మసాజ్ చేయడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మరింత ఏకాగ్రత పెరుగుతుంది.
రక్తప్రసరణ మెరుగవుతుంది:
చెవులకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. ఇది ముడిసప్తిన నాడీలలో సరైన రక్తప్రసరణను అందించడంతో పాటు, శరీరానికి శక్తి ఇస్తుంది. సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది.
శ్వాసకోశ వ్యవస్థ:
చెవుల్లోని కొన్ని పాయింట్లు శ్వాసకోశ వ్యవస్థతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. చెవులకు మసాజ్ చేయడం వలన శ్వాసకోశం మెరుగుపడుతుంది. ఆహారం శరీరానికి సరిగ్గా అందుతుంది.
ప్రశాంతమైన నిద్ర:
చెవులకు మసాజ్ చేయడం వలన ఆందోళన, ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.
చర్మం ఆరోగ్యం కూడా:
చెవులకు మసాజ్ చేయడం వలన చర్మం మీద ఉండే రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ఇది చెవుల చర్మం మీద ఆరోగ్యకరమైన మార్పులను తీసుకువస్తుంది.