Valentine's Week 2025: ప్రేమికులారా! ప్రేమ పరీక్షలు మొదలవుతున్నాయి! సిద్ధమవుతున్నారా.. లేదా?-each day of valentines week holds a special meaning and is a way to express love uniquely ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine's Week 2025: ప్రేమికులారా! ప్రేమ పరీక్షలు మొదలవుతున్నాయి! సిద్ధమవుతున్నారా.. లేదా?

Valentine's Week 2025: ప్రేమికులారా! ప్రేమ పరీక్షలు మొదలవుతున్నాయి! సిద్ధమవుతున్నారా.. లేదా?

Ramya Sri Marka HT Telugu
Feb 02, 2025 08:30 AM IST

Valentine's Week 2025: ప్రేమికులారా! రాబోతున్న ప్రేమ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. లేదా? ఈ పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణులు కావడానికి, మేము మీ కోసం కొన్ని సలహాలు, సూచనలను తీసుకొచ్చాం. వాలెంటైన్స్ వీక్ పూర్తి డేట్‌షీట్‌తో పాటు ఏ రోజును ఎలా జరుపుకోవాలో ఇక్కడ ఉంది.

 'రోజ్ డే' నుండి 'కిస్ డే' వరకు తేదీలు ఇక్కడున్నాయి సిద్దం అవండి
'రోజ్ డే' నుండి 'కిస్ డే' వరకు తేదీలు ఇక్కడున్నాయి సిద్దం అవండి (shutterstock)

ఫిబ్రవరి నెల ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు చాలా రోజులు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో ఒక వారం రోజుల పాటు ప్రేమికులకు పరీక్షలు ఉంటాయి. ప్రియుడు లేదా ప్రేయసి మనసు గెలవాలంటే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ ప్రేమ పరీక్షను ఉత్తీర్ణులైన జంటలకు వారి ప్రేమ, సంతోషం బహుమతిగా లభిస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ వారి రోజుల పరీక్షలకు సిద్దమవుతున్నారు. మరి మీ సంగతేంది.

yearly horoscope entry point

మీరు ఇంకా ఏమీ మొదలుపెట్టకపోతే ఇది మీ కోసమే. ప్రేమికులు వారం రోజుల పాటు జరుపుకునే పరీక్షలకు పేరు వాలెంటైన్ వీక్. దీంట్లో మీరు సులభంగా ఉత్తీర్ణులై ప్రేమను గెలుచుకోవడం కోసం ఇక్కడ వాలెంటైన్స్ వీక్ పూర్తి డేట్‌షీట్‌ను తీసుకువచ్చాము. ఈ వీక్‌లో ఏ రోజు ఏ డే జరుపుకుంటారో, ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

వాలెంటైన్స్ వీక్ జాబితా (Valentine Week List)

రోజ్ డే (Rose Day), ఫిబ్రవరి 7

వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న దీన్ని జరుపుకుంటారు. ఈ రోజు జంటలు ఒకరికొకరు గులాబీల పూలగుత్తులు లేదా పూలను బహుమతిగా ఇచ్చుకుంటారు. గులాబీల తాజాదనం, సువాసన ప్రేమికుల మధ్య మాధుర్యాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.

ప్రపోజ్ డే (Propose Day), ఫిబ్రవరి 8

మీరు ఇంకా మీ క్రష్‌ను ప్రపోజ్ చేయకపోతే, ఈ రోజు మీ కోసం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఓ అందమైన బహుమతితో మీరు వారికి మీ మనసులోని మాట చెప్పవచ్చు.

చాక్లెట్ డే (Chocolate Day), ఫిబ్రవరి 9

చాక్లెట్ డే మీ సంబంధంలో ప్రేమ మాధుర్యాన్ని పెంచుతుంది. ఈ రోజు జంటలు ఒకరికొకరు చాక్లెట్లను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమ సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు.

టెడ్డీ డే (Teddy Day), ఫిబ్రవరి 10

వాలెంటైన్స్ వీక్ నాల్గవ రోజు టెడ్డీ డేగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున, అబ్బాయి తన భాగస్వామికి అందమైన టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇస్తాడు. సాధారణంగా అమ్మాయిలు టెడ్డీలంటే చాలా ఇష్టపడతారు. కనుక ఈ రోజున మీ గర్ల్ ఫ్రెండ్‌ను టెడ్డీతో ఇంప్రెస్ చేయండి.

ప్రామిస్ డే (Promise Day), ఫిబ్రవరి 11

వాలెంటైన్స్ వీక్ ఐదవ రోజు ఒకరికొకరు ప్రేమ బంధంలో కలిసి ఉండే వాగ్దానంతో వస్తుంది. ప్రేమికులు ఈ రోజు ఒకరికొకరు ప్రేమలో చేసిన వాగ్దానాలను జీవితం పొడవునా పాటిస్తామని వాగ్దానం చేస్తారు.

హగ్ డే (Hug Day), ఫిబ్రవరి 12

వాలెంటైన్స్ వీక్ ఆరవ రోజును హగ్ డేగా జరుపుకుంటారు. అనేక పరిశోధనల ప్రకారం, గుండెల్లో హత్తుకుని కౌగిలించుకోవడం వల్ల మనసులోని బాధలు, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కాబట్టి మీ భాగస్వామితో ఏదైనా గొడవ ఉంటే ఈ రోజున వారిని హత్తుకుని ప్రేమను మీ వ్యక్తం చేయండి.

కిస్ డే (Kiss Day), ఫిబ్రవరి 13

వాలెంటైన్స్ వీక్ లో ఏడవ రోజును కిస్ డే లా జరుపుకుంటారు. లోతైన ప్రేమకు, ఆప్యాయత, సాన్నిహిత్యానికి చిహ్నం ముద్దు. భాగస్వాముల మధ్య సంబంధాలను ముద్దు బలోపేతం చేస్తుంది. కనుక ఈ రోజుగా మీ ప్రియుడు లేదా ప్రేయసికి ప్రేమతో ఓ ముద్దు ఇచ్చి ప్రపోజ్ చేయండి.

వాలెంటైన్స్ డే (Valentine Day), ఫిబ్రవరి 14

వాలెంటైన్స్ వీక్ చివరి రోజు అయిన ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు నాణ్యమైన సమయాన్ని ఇచ్చి తమ సంబంధాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. రొమాంటిక్ బహుమతులు, హృదయపూర్వక హావభావాలతో ప్రేమను ప్రత్యేకంగా వ్యక్త పరిచే గ్రాండ్ ఫినాలే ఇది.

Whats_app_banner