మహాశివరాత్రికి ఎంతో మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసే సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తాగవచ్చు. రోజంతా ఏమీ తినకుండా ఉంటే శక్తి స్థాయిలు సన్నగిల్లుతాయి. ఉసవాసం చేసేటప్పుడు తాండై పానీయం తాగితే శక్తి వస్తుంది. అన్నట్టు దీన్ని శివరాత్రికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు.
హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగ శివ పార్వతులకు అంకితం చేశారు. భోళేనాథుడు… పార్వతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు ఇదేనని చెబుతారు. ఈ రోజున శివ భక్తులు పూజ చేసి, భక్తితో ఉపవాసం కూడా ఉంటారు. శివలింగానికి అభిషేకం చేస్తారు.
ఈ ఉపవాస సమయంలో ఫలహార పదార్థాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా, మీకు అనారోగ్యంగా ఉన్నా, చాలా బలహీనంగా అనిపించినా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. శివరాత్రి ఉపవాసాన్ని పిల్లల నుండి పెద్దలు వరకు అందరూ ఉంటారు. ఉపవాసం ఉండి ఆకలిగా ఉంటే, మీరు తాండై పానీయం తీసుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల మీకు శక్తి కూడా లభిస్తుంది. పొట్ట కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీన్ని మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. తాండై రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బాదంపప్పులు - పది
పిస్తాలు పప్పులు - 10
జీడిపప్పులు - ఐదు
ఆకుపచ్చ యాలకులు - నాలుగు
సోంపు గింజలు - ఒక స్పూను
గసగసాలు - ఒక స్పూను
రోజ్ వాటర్ - రెండు స్పూన్లు
కేవ్రా ఎసెన్స్ - ఒక టేబుల్ స్పూను
పూర్తిగా కొవ్వు ఉన్న పాలు - ఒక లీటరు
చక్కెర - అరకప్పు
కుంకుమ పువ్వు రేకులు - ఏడు
మిరియాలు - అయిదు
ఎన్నో రకాల నట్స్ వేసాము. కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. బాదంపప్పులు, జీడిపప్పులు, మిరియాలు, సోంపు గింజలు, పిస్తాలు వంటివన్నీ కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి ఇవన్నీ మేలు చేస్తాయి శక్తిని అందిస్తాయి.
సంబంధిత కథనం