Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది
Drumstick Chicken Gravy: చికెన్ ఎప్పుడూ ఒకేలా వండితే టేస్టీగా ఉండదు. ఒకసారి మునక్కాడలను కలిపి చికెన్ గ్రేవీ చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ లో ఈ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము.
Drumstick Chicken Gravy: ఆంధ్ర స్టైల్‌లో మునక్కా చికెన్ గ్రేవీ ఒకసారి చేసుకుని తింటే మీరే దానికి అభిమానులుగా మారిపోతారు. ఈ కూరను అన్నంలో కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ తో పాటు చపాతి, రోటీల్లో కూడా ఈ మునక్కాడ చికెన్ ఇగురు అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము.

మునక్కాడ చికెన్ గ్రేవీ రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ - అరకిలో
మునక్కాడ - ఒకటి
టమోటో - ఒకటి
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
లవంగాలు - మూడు
మిరియాల పొడి - ఒక స్పూను
కొబ్బరి పొడి - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
వెల్లుల్లి - పదిహేను రెబ్బలు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కావలసినంత
పుదీనా - అరకప్పు
కొత్తిమీర - అరకప్పు
అల్లం - చిన్నముక్క
మునక్కాడ చికెన్ గ్రేవీ రెసిపీ
1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఇగురు కోసం మసాలా పేస్టు రెడీ చేసుకోవాలి.
4. ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్ చేసి.. ఆ పేస్టును పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. నూనెలో లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
7. తర్వాత మునక్కాడ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
8. పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.
9. ఈ మిశ్రమంలో రుబ్బిన పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
11. చిన్న మంట మీద పది నిమిషాలు పాటు ఉడికించాలి.
12. గ్రేవీ కోసం కొంచెం నీళ్లు వేసి బాగా కలపాలి.
13. తర్వాత టమోటా ప్యూరీని వేసి బాగా కలపాలి.
14. పావుగంట పాటు అలా వదిలేస్తే చికెన్ బాగా ఉడుకుతుంది.
15. ఆ తర్వాత ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని మరొక పది నిమిషాల పాటు ఉంచాలి.
16. ఈ ఇగురు బ్రౌన్ రంగులో యమ్మీగా కనిపిస్తుంది.
17. అప్పుడు స్టవ్ కట్ చేయాలి. అంతే ఆంధ్ర స్టైల్ లో మునక్కాడ చికెన్ గ్రేవీ రెడీ అయినట్టే.
18. ఈ మునక్కాడలు చికెన్ గ్రేవీకి కొత్త రుచులు అందిస్తాయి.
చికెన్ మునక్కాడ కాంబినేషన్ రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని తింటే మీకే తినాలనిపిస్తుంది. అరకిలో చికెన్‌కు ఒక మునక్కాడ వేస్తే సరిపోతుంది. అదే కిలో చికెన్ తీసుకుంటే రెండు ములక్కాడలు తీసుకోవాలి. ఈ ఇగురు ఒక్కసారి రుచి చూస్తే వదలలేరు.
టాపిక్