Dont drink Water: ఈ ఆహారాలు తింటున్నప్పుడు నీళ్లు తాగడం మంచి అలవాటు కాదు-drinking water while eating these foods is not a good habit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dont Drink Water: ఈ ఆహారాలు తింటున్నప్పుడు నీళ్లు తాగడం మంచి అలవాటు కాదు

Dont drink Water: ఈ ఆహారాలు తింటున్నప్పుడు నీళ్లు తాగడం మంచి అలవాటు కాదు

Haritha Chappa HT Telugu
Published Dec 16, 2023 12:47 PM IST

Dont drink Water: భోజనం చేస్తూ నీళ్లు తాగే వారి సంఖ్య ఎక్కువే. అయితే కొన్ని రకాల ఆహారాలు తింటున్నప్పుడు నీళ్లను దూరం పెట్టాలి.

భోజనం చేసే సమయంలో నీళ్లు తాగవచ్చా?
భోజనం చేసే సమయంలో నీళ్లు తాగవచ్చా? (pixabay)

Dont drink Water: భోజనంతో పాటు నీళ్లు తాగే విషయంలో ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చెబితే మరికొందరు మధ్య మధ్యలో నీళ్లు తాగడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలతో మాత్రం నీటిని తాగకూడదు. ఈ ఆహారాలు తిన్నాక కనీసం పావుగంటసేపు గ్యాప్ ఇచ్చాకే నీటిని తాగాలి. లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల అసౌకర్యాలు కూడా కలగవచ్చు. అలాంటి ఆహార పదార్థాలు ఏవో చూద్దాం.

స్పైసీగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు నోటిలో మంట పుడుతుంది. అలాంటప్పుడు ఎక్కువ మంది గడగడా నీళ్లు తాగేస్తారు. ఇలా చేయడం వల్ల నోటి చుట్టూ వేడి వ్యాపిస్తుంది. మంట కూడా ఎక్కువవుతుంది. ఇది కడుపు ఉబ్బరానికి, అసౌకర్యానికి దారి తీయవచ్చు. కాబట్టి కారంగా ఉన్నా కూడా కాసేపు ఓర్చుకోవడమే చాలా మంచిది.

కొవ్వు నిండిన పదార్థాలు తిన్నప్పుడు పొట్ట బరువుగా ఉన్నట్టు, ఉబ్బరంగా ఉన్నట్టు అనుభూతి వస్తుంది. అలాంటప్పుడు నీళ్లు అధికంగా తాగితే అసౌకర్యం ఇంకా పెరుగుతుంది. ఆహార పదార్థాలు తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నేను తాగడం మంచి పద్ధతి కాదు. ఇది పొట్టలో ఇబ్బందులకు కారణం అవుతుంది.

భోజనం చేసిన తర్వాత నీళ్లు , సోడా, కూల్ డ్రింకులు వంటివి తాగడం హానికరం. ఈ అలవాటు ఎంతో మందికి ఉంటుంది. బిర్యానీతో పాటు కూల్ డ్రింకులు తాగే వారి సంఖ్య ఎక్కువ. నిజానికి ఇది ఒక అనారోగ్యకరమైన అలవాటు. ఇలా చేయడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్ ఎక్కువైపోతాయి. చివరికి అజీర్ణానికి కారణం అవుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ దూరంగా పెట్టడం మంచిది.

పొట్ట నిండా భోజనం తిన్నాక ఎక్కువ నీళ్లు తాగడం మంచి పద్ధతి కాదు. ఇది పొట్టలో అసౌకర్యంగా ఉండేలా చేస్తుంది. భోజనం తిన్నాక కనీసం అరగంట పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత నీళ్లు తాగితే మంచిది. అది కూడా అధిక మొత్తంలో తాగడం మంచిది కాదు. భోజనం చేసిన గంట తర్వాత అధిక మొత్తంలో నీళ్లు తాగొచ్చు. అప్పుడు కొంత ఆహారం జీర్ణం అవుతూ ఉంటుంది, కాబట్టి పొట్టలో ఖాళీ ఏర్పడుతుంది. నీళ్లు తాగినా పర్వాలేదు.

Whats_app_banner