పాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమయంలో తాగితే విషంతో సమానమట జాగ్రత్త!
పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ వాటిని తాగే విధానం, సమయం సరిగ్గా లేకపోతే అవి విషంతో సమానమట. పాలు తాగడానికి సరైన సమయం ఏది..? ఏ సమయంలో తాగడం అనారోగ్యానికి కారణం..? వంటి విషయాలు తెలుసుకుందాం రండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఎందుకంటే పాలు ఒక సంపూర్ణ ఆహారం అంటే మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పాలలో లభిస్తాయి. అయినప్పటికీ వీటిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో తాగడం చాలా ముఖ్యం. తాగకూడని సమయాల్లో పాలను తాగడం వల్ల వె అవి విషంతో సమానంగా మారతాయట. అంటే అంతటి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతాయని అర్థం.
సాధాణంరగా పాలు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు తాగడానికి ఇష్టపడతారు. అయితే రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు పాల ప్రయోజనాలను పుష్కలంగా కోరుకుంటే, దానిని తాగే విధానం కూడా ముఖ్యం. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే పాలు తాగడం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కాలం తర్వాత పాలు తాగడం కరెక్ట్ అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
ఆహారానికి పాలకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?
ఆయుర్వేదంలో, రాత్రి పడుకునే ముందు పాలు తాగడం అమృతం కంటే తక్కువ కాదు. అయితే తిన్న వెంటనే పాలు తాగడం మానేయాలని సూచించారు. నిజానికి తిన్న కొద్దిసేపటికే పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మనం ఆహారం తినేటప్పుడు, అది మన కడుపులో ఒక గంట పాటు ఉంటుంది. అంటే ఈ సమయంలో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో పాలు తాగడం వల్ల పాలు ఆహారంలోకి కలిసిపోతాయి. కనుక తిన్న తర్వాత కనీసం గంట నుంచి గంటన్నర గ్యాప్ తీసుకున్న మాత్రమే పాలు తాగాలి. ఒకవేళ ఆహారం ఆలస్యంగా తింటే పాలు తాగకపోవడమే మంచిది.
పాలు ఉప్పు కలిపి తాగడం:
ఆయుర్వేదం ప్రకారం.. పాలు, ఉప్పు వ్యతిరేక ఆహారాలు. వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పాలు, ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వ్యాయామానికి ముందు:
వ్యాయామం చేసిన తర్వాత గ్యాస్ సమస్యలు, వాంతులు రావడానికి పాలు కారణమవుతాయి. ఇవి శరీరంలో త్వరగా పచనమవుతాయి కాబట్టి వ్యాయామానికి ముందు, అలాగే ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
మొక్కజొన్న లేదా కూరగాయలతో పాటు:
మొక్కజొన్న, ఎర్రమాంసం లేదా కూరగాయలతో పాలు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇది ఆహారం జీర్ణం అవడంలో అవరోధాలను కలిగించి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
చాకొలెట్ లేదా మిఠాయిలతో పాటు:
పాలుతో చాకొలెట్ లేదా మిఠాయిలు తినడం రక్తంలో చక్కర స్థాయిలను బాగా పెంచుతుంది, ఇది డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీయవచ్చు.ఈ పరిస్థితులలో పాలు తాగడం జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్ణం లేదా శరీర సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
చల్లటి పాలు తాగడం:
ఎల్లప్పుడూ పాలను తేలికగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే త్రాగాలి. చల్లని పాలు లేదా బాగా వేడి పాలు తాగడం మంచిది కాదు.