Coffee and Heart: ఈ సమయంలో కాఫీ తాగితే గుండె పోటు వచ్చే ముప్పు తగ్గుతుందట, చెబుతున్న కొత్త పరిశోధన-drinking coffee during this time can reduce the risk of heart attack says new research ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee And Heart: ఈ సమయంలో కాఫీ తాగితే గుండె పోటు వచ్చే ముప్పు తగ్గుతుందట, చెబుతున్న కొత్త పరిశోధన

Coffee and Heart: ఈ సమయంలో కాఫీ తాగితే గుండె పోటు వచ్చే ముప్పు తగ్గుతుందట, చెబుతున్న కొత్త పరిశోధన

Haritha Chappa HT Telugu
Jan 09, 2025 10:38 AM IST

Coffee: కాఫీ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ముఖ్యంగా ప్రతి రోజూ ఒకే సమయంలో కాఫీ తాగితే గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని కొత్త పరిశోధన చెబుతోంది.

కాఫీతో గుండెకు మేలు
కాఫీతో గుండెకు మేలు (Shutterstock)

టీ తర్వాత ఎక్కువ మంది తాగేది కాఫీ. ప్రపంచంలో అధిక శాతం మంది తాగుతున్న పానీయాల్లో టీ, కాఫీలే ఎక్కువ. టీ లవర్స్, కాఫీ ప్రియుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇవి ఆరోగ్యకరమో కాదో తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. గుండె ఆరోగ్యానికి కాఫీలు ఎంతో మేలు చేస్తాయని అంటారు.

yearly horoscope entry point

కొంతమంది కాఫీతో తమ రోజును ప్రారంభిస్తే, కొంతమంది టీ తాగుతారు. మరికొందరు రోజులో అనేక కప్పుల కాఫీ తాగుతూ ఉంటారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కాఫీ మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇందులో ఉండే కెఫిన్ కారణంగా కాఫీని పరిమిత మొత్తంలో తాగడం చాలా ముఖ్యం. ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం కాఫీ తాగడానికి సరైన సమయం ఒకటుంది. ఆ సమయానికి కాఫీని తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.

కాఫీ ఎప్పుడు తాగాలి?

ఇటీవల యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఉదయం పూట కాఫీ తాగడం చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఉదయం పూట కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అదే సమయంలో, అటువంటి వ్యక్తులలో ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా 16 శాతం తగ్గింది. అయితే ఈ ప్రయోజనాలన్నీ ఉదయాన్నే కాఫీ తాగేవారిలో మాత్రమే కనిపిస్తాయి. అంటే, మీరు రోజంతా వేరే సమయంలో కాఫీ తాగుతుంటే, మీరు ఈ ప్రయోజనాలను పొందకపోవచ్చు. అయితే, దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది.

రోజులో మరే సమయంలోనైనా కాఫీ తాగడం కంటే ఉదయాన్నే కాఫీ తాగడం మంచిదని భావిస్తారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజితం చేస్తుందని అధ్యయనం చెబుతోంది. రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది కాఫీ. రోజూ ఆలస్యంగా కాఫీ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత గడియారం దెబ్బతింటుందని, ఇది హార్మోన్ల స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ లు క్వి చెప్పారు. అదే సమయంలో, ఇది గుండె ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న మంట, రక్తపోటు వంటి కారకాలపై కూడా ప్రభావం చూపుతుంది.

కాఫీని చిన్న పిల్లలకు తాగించడం మాత్రం మంచి పద్దతి కాదు, వారికి ప్రొటీన్, కాల్షియం నిండిన పాలను తాగించాలి. పాలు కలిపిన కాఫీనే కాదు, బ్లాక్ కాఫీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అధికంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫీన్ పేరుకుపోతుంది. కాబట్టి రోజుకు రెండు కప్పుల కాఫీ కన్నా ఎక్కువగా తాగకపోవడమే అన్ని విధాలా మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner