Weight loss Coffee: కాఫీని ఇలా చేసుకొని రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గుతారు!
Weight loss Coffee: సరైన డైట్‍తో పాటు కొన్ని రకాల డ్రింక్స్ తయారు చేసుకొని తాగితే బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాంటిదే ఈ కాఫీ. పసుపుతో చేసే ఈ కాఫీ తాగితే వెయిట్ లాస్‍కు సహకరిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. తాగకపోతే ఏదో లోటుగా భావిస్తారు. కాఫీ తీసుకుంటే యాక్టివ్‍గా ఫీల్ అవుతారు. కాఫీ అలవాటు ఉంటే.. బరువు తగ్గాలని ప్రయత్నించే సమయాల్లోనూ తీసుకుంటూ ఉంటారు. అయితే, కాఫీని కాస్త భిన్నంగా పసుపుతో తయారు చేసుకుంటే బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. పసుపులోని గుణాలు ఇందుకు తోడ్పడతాయి. పసుపు కాఫీ ఎలా చేసుకోవాలో.. వెయిట్ లాస్‍కు ఎలా సహకరిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
పసుపు కాఫీ తయారీ ఇలా..
కావాల్సిన పదార్థాలు: టీస్పూన్ కాఫీ పొడి, కప్పు నీరు, ఓ టీస్పూన్ పసుపు, ఓ టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, పాలు (ఆప్షనల్)
పసుపు కాఫీ తయారీ విధానం: ముందుగా ఓ కప్ నీటిలో కాఫీ పొడి వేసుకొని మరిగించుకోవాలి. స్ట్రాంగ్‍గా బ్లాక్ కాఫీలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ కప్‍లో పసుపు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడిని కలుపుకోవాలి. దాంట్లో కాఫీ ద్రావణాన్ని పోసి బాగా కలపాలి. కావాలంటే రుచికోసం కాస్త పాలు లేదా కొబ్బరి పాలు వేసుకోవచ్చు. తీపి కోసం కాస్త తేనె కలుపుకోవచ్చు. వేడివేడిగా ఈ కాఫీ తాగాలి.
పసుపు కాఫీ ప్రయోజనాలు ఇవి
- బరువు తగ్గేందుకు: పసుపు కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. పసుపులోని కర్గుమిన్ ఇందుకు ఎక్కువగా సహకరిస్తుంది. పసుపులో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీర వాపు తగ్గించగలదు. శరీరంలో జీవక్రియ మెరుగై క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేలా చేయగలదు. ఈ కాఫీ రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
- జీర్ణం మెరుగ్గా..: శరీరంలో బైల్ ఉత్పత్తిని పసుపు మెరుగుపరుస్తుంది. దీనివల్ల జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇలా కూడా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
- రోగ నిరోధక శక్తి: పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ పసుపు కాఫీ తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధుల రిస్క్‌ను ఇది తగ్గిస్తుంది. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ కూడా రోగ నిరోధక శక్తికి మేలు చేస్తుంది.
- మెదడు పనితీరు మెరుగు: కాఫీలోని కెఫిన్.. ఏకాగ్రతను పెంచుతుంది. పసుపులోని కర్గుమిన్.. మెదడు ఆక్సిడేటివ్ స్ట్రెస్‍ను తగ్గిస్తుంది. ఈ కాఫీ తాగితే జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు సహకరిస్తుంది.
- చర్మ ఆరోగ్యానికి..: పసుపులోని యాంటీ ఇన్‍ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మపు మెరుపును పెంచటంతో పాటు మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. అందుకే ఈ పసుపు కాఫీ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.