Drink for BellyFat: పొట్ట దగ్గర ఫ్యాట్ త్వరగా కరిగించుకోవాలంటే ఈ డ్రింక్ తాగి వ్యాయామం చేయండి చాలు
Drink for BellyFat: పొట్ట దగ్గర చేరిన కొవ్వును చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తుంది. ఎంతో మంది బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ బెల్లీఫ్యాట్ ను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలుచేస్తారు. ఇక్కడ మేము ఒక సింపుల్ చిట్కా ఇచ్చాం… ఫాలో అయిపోయింది.

బెల్లీ ఫ్యాట్… అంటే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయే సమస్య. ఇది ఎంతో మందిని ఊబకాయుల జాబితాలోకి నెట్టేస్తోంది. దీన్ని తగ్గించుకోవడం ఆరోగ్యరీత్యా కూడా అత్యవసరం. ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించి విఫలమైనవారి సంఖ్య ఎక్కువే. నిరాశతో వారు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఇలా పొట్ట దగ్గర కొవ్వును వదిలేస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కేవలం ఆహారం తగ్గించుకుంటే సరిపోదు. కొవ్వును కరిగించే ఆహారాలను తినాలి. వ్యాయామం చేయాలి. జీవక్రియను పెంచడం ద్వారా బొడ్డు కొవ్వును తగ్గించుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇక్కడ మేము ఒక హెల్తీ డ్రింక్ ఇచ్చాము. దీన్ని ప్రతిరోజూ తాగడం ద్వారా పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కరిగించుకోవచ్చు.
బెల్లీ ఫ్యాట్ ఇలా తగ్గించుకోండి
- ఆఫీసులో పని చేస్తున్నప్పుడు గంటల తరబడి సీట్లో కూర్చోకూడదు. ప్రతి అరగంటకు ఒకసారి మీ సీటు నుండి లేచి ఇటూ అటూ నడించేందుకు ప్రయత్నించండి. లేదా సీట్లోనే కూర్చుని బాడీని స్ట్రెచ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది.
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి, ఇలా చేయడం వల్ల మీ కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గడం సులభం అవుతుంది.
- మాల్ లేదా మీ కార్యాలయానికి వెళ్లి, లిఫ్ట్ కు బదులుగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోగలుగుతారు. ఇది బెల్లీ ఫ్యాట్ ను కూడా వేగంగా తగ్గిస్తుంది.
- మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచడానికి, బొడ్డు కొవ్వును వేగంగా తగ్గించడానికి, మీ దినచర్యలో కొన్ని వ్యాయామాలను చేర్చండి. ప్లాంక్స్, సిట్ అప్స్ వంటి వ్యాయామాలు పొట్టను తగ్గించడంలో చాలా సహాయపడతాయి.
రోజూ కొన్ని యోగాసనాలు వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. రోజువారీ దినచర్యలో కోనాసనం, ఉష్టాసనం, ధనుర్వక్రాసనం చేయవచ్చు. ప్రారంభంలో, ఈ ఆసనాలు చేయడం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు వాటిని ప్రతిరోజూ చేయడం ఆరంభించాక ఈ ఆసనాలు మీకు సులభంగా కనిపిస్తాయి.
బెల్లీప్యాట్ తగ్గించే డ్రింక్
బొడ్డు కొవ్వును తగ్గించడానికి, మీరు మీ దినచర్యలో ఒక పానీయాన్ని చేర్చుకోవాలి. దీన్ని తయారు చేయడానికి, మీకు ఆపిల్ సైడర్ వెనిగర్, పుదీనా ఆకులు, చియా విత్తనాలు, నీరు, అల్లం రసం అవసరం పడతాయి. పానీయం తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ నానబెట్టిన చియా విత్తనాలు, 4 నుండి 5 పుదీనా ఆకులు, ఒక టీస్పూన్ అల్లం రసం కలపండి. బాగా కలిపిన తర్వాత ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఆ నీటిని తాగేయండి. ఇలా కొన్ని నెలల పాటూ చేయండి. మీ బెల్లీ ఫ్యాట్ కరగడం మీరే గుర్తిస్తారు. పరగడుపున తాగడం వల్ల ఈ పానీయం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
టాపిక్