Lady Finger Water Benefits : బెండకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.. ఉదయం తాగితే ఫుల్ ప్రయోజనాలు-drink lady finger water on empty stomach daily morning to get super benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Drink Lady Finger Water On Empty Stomach Daily Morning To Get Super Benefits

Lady Finger Water Benefits : బెండకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.. ఉదయం తాగితే ఫుల్ ప్రయోజనాలు

Anand Sai HT Telugu
Mar 16, 2024 02:00 PM IST

Okra Water Benefits : బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే బెండకాయ నీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే కూడా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

నానబెట్టిన బెండకాయ నీటి ఉపయోగాలు
నానబెట్టిన బెండకాయ నీటి ఉపయోగాలు (Unsplash)

ప్రతి కూరగాయ వేరే రుచిని కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలను కలిగి ఉంటాయి. బెండకాయ కూడా అందులో ఒకటి. అయితే ఇది బంక బంక ఉండటం వలన చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ భారతదేశంలో వంటలలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ఒకటి బెండ.

బెండకాయ ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైనదని నిపుణులు అంటున్నారు. బెండకాయ పూర్తి ప్రయోజనాలను పొందడానికి నీటిలో నానబెట్టి తాగాలి. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై ఆందోళన పెరిగిపోవడంతో చాలా మంది ఈ నీటిని తాగడం అలవాటు చేసుకున్నారు. బెండకాయ నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.

బరువు తగ్గేందుకు

బెండకాయలో విటమిన్ బి, సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు..

మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయ నీటిని తాగడం మంచిదని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. . ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణలో బాగా సహాయపడుతాయి. ఈ నీటిని తాగడం వల్ల ఆహారం నుండి కార్బోహైడ్రేట్ల శోషణ నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థకు

బెండకాయలో ఫ్లేవనాయిడ్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. శరీరం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ నీటిని తాగాలి.

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు

వివిధ అధ్యయనాల ప్రకారం, బెండకాయలోని సమ్మేళనాలు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బెండకాయ నానబెట్టిన నీటిని తాగితే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇందులో అనేక పోషకాలు

బెండకాయ నానబెట్టిన నీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. ఈ నీటిని తాగినప్పుడు, ఇందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు వెళ్తాయి. ఈ రెండు విధులు శరీరంలో బాగా జరిగితే, చర్మం అకాల వృద్ధాప్యం నిరోధించబడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మీరు అందంగా కనిపించాలన్నా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నా బెండకాయ నీటిని తాగండి.

రోజూ బెండకాయ నీరు తాగడం మంచిది. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగాలి. దీన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఇందులోని పోషకాలు పూర్తిగా శరీరం గ్రహించి ప్రయోజనాలను పొందవచ్చు.

బెండకాయ నీటిని ఎలా తయారు చేయాలి

ముందుగా నాలుగైదు బెండకాయు తీసుకోండి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో రెండు గ్లాసుల నీరు పోసుకోవాలి. అందులో కట్ చేసిన బెండకాయలు వేసుకోవాలి. వాటిని రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టాలి. ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి.

ఎవరు తాగకూడదు

బెండకాయ నీటిని వాపు ఉన్నవారు తాగకూడదు. ప్రేగు సిండ్రోమ్ (IBS) ఉన్న వ్యక్తులు నీటిని తాగరాదు. ఎందుకంటే ఇందులో ఫ్రక్టాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఎవరైనా రోజువారీ ఆహారంలో ఏదైనా మార్పు చేస్తుంటే నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel