Tea and Coffee: టీ తాగే బదులు ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగండి, ఈ సమస్యలన్నీ తగ్గుతాయి
Tea and Coffee: ప్రతిరోజూ టీ తాగే అలవాటు ఎంతో మందికి ఉంది. అలాంటి వారు టీ బదులు కాఫీ తాగేందుకు ప్రయత్నించండి. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రతిరోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగుతూనే గుడ్ మార్నింగ్ చెప్పేవారు ఎంతోమంది. టీ, కాఫీలకు బదులు బ్లాక్ కాఫీ తాగమని చెబుతోంది కొత్త అధ్యయనం. ప్రతి ఉదయం బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా రావు. బ్లాక్ కాఫీ... టీ బదులు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి శక్తి వెంటనే అందుతుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏకాగ్రత పెరగడంతో పాటు చురుకుదనం కూడా దక్కుతుంది. ప్రతిరోజు ఉదయం బ్లాక్ కాఫీ ని తాగడం వల్ల ఆ రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. కాకపోతే దీనిలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజులో ఒకసారి మాత్రమే బ్లాక్ కాఫీ తాగేందుకు ప్రయత్నించండి.
క్యాలరీలు సున్నా
బ్లాక్ కాఫీలో క్యాలరీలు ఉండవు. చక్కెర, క్రీమ్ వంటివి దీనిలో కలపము. కాబట్టి ఇది క్యాలరీ రహిత పానీయం. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి బ్లాక్ కాఫీ మంచి ఎంపిక. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ శక్తిని మాత్రం అందిస్తుంది. టీ తాగే వారు అందులో చక్కెర పాలు వంటివి కలుపుతారు. ఇవన్నీ కూడా కేలరీలతో కూడినవి. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బ్లాక్ కాఫీతో ఆ సమస్య లేదు.
పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు
బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్మమేషన్ తగ్గిస్తాయి. మధుమేహం, గుండె సమస్యలు వంటివి రాకుండా కాపాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనకు రక్షణ కల్పిస్తాయి. టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ.. బ్లాక్ కాఫీలో అధికంగా ఉంటాయి.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి
మీకు పనిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగేందుకు ప్రయత్నించండి. ఈ కాఫీ క్రమం తప్పకుండా తాగితే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
క్రీడాకారులకు బ్లాక్ కాఫీ తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఇది శారీరక పనితీరును చురుగ్గా మారుస్తుంది. వ్యాయామానికి ముందు ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. తీవ్రమైన శారీరక శ్రమకు బ్లాక్ కాఫీ శక్తిలా ఉపయోగపడుతుంది.
బ్లాక్ కాఫీ చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది. శీతాకాలంలో కాఫీ, టీ తాగే వారికి వెచ్చదనం కావాలనిపిస్తుంది. అలాంటివారు ఈ బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి తగ్గ వేడి దక్కుతుంది.
నిజానికి బ్లాక్ కాఫీ, టీ రెండూ కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఇవి రెండూ కూడా వాటి వాటి ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. టీతో పోలిస్తే బ్లాక్ కాఫీ బరువును అదుపులో ఉంచుతుంది. మంచి సువాసనను కలిగి ఉంటుంది.దీనిలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి చురుకుదనం వెంటనే అందుతుంది. మీ ఉత్పాదకతను పెంచుతుంది. ఉద్యోగాలు చేసేవారు బ్లాక్ కాఫీన్ తాగడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం