జ్ఞానం, సమానత్వం, స్వేచ్ఛ – ఇవి కేవలం పదాలు మాత్రమే కాదు. ఒక మహానుభావుడు ఈ విలువల కోసం తన బతుకంతా పోరాడాడు. వీటికోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, అసాధారణంగా జీవించి, అసమాన్యంగా భారతదేశ చరిత్రను మలిచిన నేత అంబేద్కర్.అణగారిన వర్గాలకు స్వరమవుతూ, చదువు ద్వారా చైతన్యాన్ని, రాజ్యాంగం ద్వారా హక్కులను, బౌద్ధ ధర్మం ద్వారా మానవత్వాన్ని అందించిన మహానాయకుడు.
ఆయన నాయకత్వం లేకపోతే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలు, సమానతలు, హక్కులు ఇంత బలంగా ఉండేవి కావేమో. ఇలాంటి మహానుభావుడిని ఏప్రిల్ 14న ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత, ఆయనకిచ్చే గౌరవం కూడా. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను గుర్తు చేసుకుందాం.
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయవేత్త, గొప్పి చింతనకర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం. ఆయన జీవితం, సిద్ధాంతాలు, ఆలోచనలకు ప్రతిబింబంగా నిలిచే 15 రకాల స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ ను ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
1. “చదువు మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది, జ్ఞానం మనకు స్వేచ్ఛనిస్తుంది.”
2. “చదవండి, ఆలోచించండి, ప్రశ్నించండి – ఇది మార్పుకు మార్గం!”
3. “ఒక మంచి మనిషిని తయారు చేయడం, ఒక గొప్ప నాయకుడిని తయారు చేయడం కంటే గొప్ప విషయం.”
4. “సమాజంలో ఉన్న అసమానతని ధ్వంసం చేయకపోతే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లేదు.”
5. “నన్ను దూషించిన వారిని మరిచిపోతాను, కానీ నన్ను నమ్మిన వారిని ఎన్నటికీ మర్చిపోను.”
6. “విద్య లేకపోతే, స్వేచ్ఛ కలగదు. స్వేచ్ఛ లేకపోతే, అభివృద్ధి ఉండదు.”
7. “నేను దేవుని లాగా రాజ్యాంగాన్ని నమ్మను, కానీ రాజ్యాంగాన్ని నమ్మే విధంగా పని చేస్తాను”
8. “ఎంత చదివినా, మన చుట్టూ ఉన్న అవమానాలను తొలగించేందుకు ఉపయోగపడకపోతే, ఆ చదువు వ్యర్థం.”
9. "కులవ్యవస్థను సమాజం నుంచి తొలగించకపోతే, సమాజం పురోగమించదు."
10. “ప్రతి వ్యక్తి ముందు సమానత్వం ఉండాలి, అదే నిజమైన ప్రజాస్వామ్యం.”
11. “నీవు ఎవరనేది కాదు, నీవు ఏమవ్వాలనుకుంటున్నావో అది ముఖ్యమైనది.”
12. “నమ్మకం , అహింస మన మార్గదర్శకాలు కావాలి.”
13. “ఇతరులు ఇచ్చే అవకాశాలను ఆశించవద్దు – మీకు మీరే అవకాశాల్ని సృష్టించాలి.”
14. “మతం అనేది వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేయాలి, బానిసత్వానికి కాదు.”
15. "మానవ హక్కులు పట్ల గౌరవం ఉన్నప్పుడే నిజమైన స్వేచ్ఛ ఉత్పన్నమవుతుంది."
ఏప్రిల్ 14న ప్రతి ఒక్కరి హక్కు కోసం పోరాడిన వ్యక్తి, అణగారిన బతుకులను ఆకాశానికి ఎగసేలా చేసిన శక్తి అయిన డా. బీమ్ రావ్ అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఇవే మా శుభాకాంక్షలు. - హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్