కాలిగోళ్ళు తీయడం లేదా? అయితే ఈ కష్టాలు ఇబ్బందులు మీకు తప్పక పోవచ్చు-dont you want to cut your toenails but these troubles and difficulties can definitely go away for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కాలిగోళ్ళు తీయడం లేదా? అయితే ఈ కష్టాలు ఇబ్బందులు మీకు తప్పక పోవచ్చు

కాలిగోళ్ళు తీయడం లేదా? అయితే ఈ కష్టాలు ఇబ్బందులు మీకు తప్పక పోవచ్చు

Haritha Chappa HT Telugu

చాలామంది చేతివేళ్లను ప్రతి వారం తీస్తారు. కానీ కాలిగోళ్ళ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. కాలిగోళ్లు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

కాలిగోళ్లు పెంచడం వల్ల నష్టాలు (Pixabay)

చేతులతోనే మనం అన్ని పనులు చేస్తాము. అందుకే చేతివేళ్ళకున్న గోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ గోళ్ళనే ప్రతివారం కత్తిరిస్తూ ఉంటారు. చేతి గోళ్ళని పరిశుభ్రంగా ఉంచుకుంటారు కానీ కాలిగోళ్ళ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. నిజానికి కాలిగోళ్ళను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాటిని ప్రతి వారం కత్తిరించాలి. లేకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

కాలిగోళ్ళు పెరగడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. బూట్లు వేసుకునేటప్పుడు ఆ గోల్డ్ పాదాలపై ఒత్తిడి తీసుకొస్తాయి. దీనివల్ల నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి ఇది బాధాకరమైన పరిస్థితిగా మారుతుంది. గోళ్ల అంచులు చర్మంలోకి చేర్చుకొని పోతూ ఉంటాయి. ముఖ్యంగా బొటన వేలికే ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఇలా కొనసాగితే వాపు, ఎరుపుదనం వచ్చి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది.

కాలిగోళ్లతో నష్టాలు

వేసవిలో, వర్షాకాలంలో ఖచ్చితంగా కాలి గోళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరిస్తూ ఉండాలి. ఈ పాదాలు తడిగా అయినప్పుడు ఆ పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా వంటివి చేరిపోతాయి. అక్కడ గోరు విరిగినా లేదా చర్మం తెగినా ఆ ప్రదేశంలోంచి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు శరీరంలోకి చేరిపోతాయి. అప్పుడు గోళ్లు పసుపు రంగులోకి మారి మందంగా మారుతాయి. చివరికి పెళుసుగా మారి విరిగిపోతాయి. దీనికి చికిత్స చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సమస్య చిన్నదే అయినా భరించడం కష్టంగా ఉంటుంది.

ఒత్తిడి పెరుగుతుంది

నిజానికి పాదాలకు పొడవాటి గోళ్లు ఏమాత్రం అందాన్ని ఇవ్వవు. ఇవి మీ నడక సమతుల్యతను దెబ్బతీస్తాయి. చేతి గోళ్లు పరిశుభ్రంగా ఉంచుకొని నెయిల్ పాలిష్ వేయడం వల్ల అందంగా కనిపిస్తాయి. కానీ కాలికి పొడవాటి గోళ్ళు ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఇది ఖాళీ వేళ్ళ పై అసాధారణ ఒత్తిడికి గురవుతుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది కీళ్ల నొప్పికి కారణం అవుతుంది. అలాగే కాలి ఎముకలపై కూడా ఒత్తిడి కలిగిస్తుంది. గోర్లు దగ్గర బూట్లు త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల ఎక్కువ డబ్బులు కూడా ఖర్చవుతాయి.

అతిగా పెరిగిన గోళ్లు వికారంగా కనిపిస్తాయి. ఓపెన్ షూస్ వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇది ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పాదాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

కాలిగోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించడం, శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.కాలికి ఉన్నగోళ్లను ప్రతివారం కత్తిరించాల్సిన అవసరం లేదు. ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి కత్తిరించినా చాలు. ముఖ్యంగా వాటి అంచులు పదునుగా ఉండకుండా చూసుకోండి. ఇలా గోర్లు అతిగా పెంచడం కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అవి ఎక్కువ కాల్షియం తీసుకుంటాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం