మీకు ఏమీ తినాలనిపించడం లేదా? ఆకలి చాలా తగ్గిపోయిందా? అయితే ఈ తీవ్రమైన వ్యాధి వచ్చిందేమో చెక్ చేసుకోండి-dont you feel like eating anything has your appetite decreased a lot then check if you have this serious disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీకు ఏమీ తినాలనిపించడం లేదా? ఆకలి చాలా తగ్గిపోయిందా? అయితే ఈ తీవ్రమైన వ్యాధి వచ్చిందేమో చెక్ చేసుకోండి

మీకు ఏమీ తినాలనిపించడం లేదా? ఆకలి చాలా తగ్గిపోయిందా? అయితే ఈ తీవ్రమైన వ్యాధి వచ్చిందేమో చెక్ చేసుకోండి

Haritha Chappa HT Telugu

కొంతమందికి హఠాత్తుగా ఆకలి తగ్గిపోతోంది. ఎలాంటి ఆహారం తినాలనిపించదు. ఇది మంచి సూచన కాదని చెబుతున్నారు వైద్యులు. మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి ఇలాంటి లక్షణం కలుగుతుంది.

ఆకలి లేకపోవడం సమస్యా? (Pixabay)

సరిగ్గా ఆకలి వేయడం, ఆహారం తినాలనిపించడం అనేది ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు. ఎప్పుడైతే ఈ రెండు మీలో తగ్గుతాయో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా హఠాత్తుగా ఆకలి తగ్గిపోవడం, ఆహారాన్ని చూస్తే తినాలనిపించకపోవడం అనేది కిడ్నీ వ్యాధులను సూచిస్తుంది. కాబట్టి మీకు ఈ రెండు లక్షణాలు ఉంటే మూత్రపిండాల వ్యాధి ఏదైనా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.

కిడ్నీ పనితీరు ఇలా

కిడ్నీ ప్రతిరోజు ఎంతో కష్టపడుతుంది. 180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, రక్తపోటును నియంత్రించే హార్మోన్ల విడుదలలో, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే మూత్రపిండాల్లో చిన్న లోపం వచ్చిన అది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది.

మూత్రపిండాల సమస్య ఏదైనా వస్తే ఆకలి తగ్గిపోతుంది. దీన్ని అనురెక్సియా అంటారు. మూత్రపిండాలకు ఆకలికి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకుంటే మీకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది.

కిడ్నీలకు ఆకలికి ఏమిటి సంబంధం?

మూత్రపిండాల వ్యాధికి ఆకలికి మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు వైద్యులు. అంతెందుకు మూత్రపిండాల వ్యాధి బారిన పడి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులలో చాలామందికి ఆకలి అనిపించదు. వీరిలో ఆకలి తగ్గిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని రకాల సమ్మేళనాలు, సైటోకిన్ ల నిర్మాణం వల్ల ఇలా వారిలో ఆకలి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆకలి తగ్గిపోవడం అనేది మంచి సూచన మాత్రం కాదు.

ఆకలి తగ్గిపోవడం వల్ల ఆహారాన్ని చూడగానే వెగటుగా అనిపిస్తుంది. ఏమీ తినాలనిపించదు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. శరీరానికి కావలసిన విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు సరిగా అందపు. ఫలితంగా ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు. తీవ్రమైన అనారోగ్యం కూడా అంతర్లీనంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకలి తగ్గిపోతే దాన్ని తేలికగా తీసుకోకండి. ఒకరోజు లేదా రెండు రోజులు ఆకలి తగ్గిపోతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.