డిప్రెషన్, ఒత్తిడితో బాధపడేవారి మధ్య కొంతమంది మానసికంగా, భావోద్వేగపరంగా బలంగా ఉంటారు. అటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీలో ఉన్న బలహీనతలను బయటకు చెప్పకుండా తెలివిగా వ్యవహరించండి. ప్రతికూల పరిస్థితుల్లోనూ మానసికంగా బలంగా ఉండేందుకు కొన్ని అలవాట్లను మార్చుకోండి. ఏ సమస్యనైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మానసికంగా బలంగా మారడానికి మీరు మార్చుకోవాల్సిన 7 రకాల అలవాట్లు ఏంటో తెలుసుకుందామా..
ఎమోషనల్ గా బలంగా ఉండాలంటే ముందుకు మీరు అలవరచుకోవాల్సింది సెల్ఫ్ బౌండరీలను నిర్మించుకోవడం. మిమ్మల్ని మీరు ఏ విషయంలో ఎంతవరకూ వ్యవహరించగలరో ప్రశ్నించుకోవాలి. మీరు చేయలేని పనులకు, మీరు భరించలేని ప్రవర్తనకు ఏ మాత్రం తటాపటాయించకుండా సున్నితంగా నిరాకరించండి.
మనం చేసిన తప్పులను ఇతరులపై తోసేయకూడదు. నాకు సంబంధం లేదని బుకాయించకూడదు. అటువంటి వ్యక్తిత్వంతో వ్యవహరిస్తూ ఇతరులపై ఆరోపణలు చేయకుండా, తప్పులకు బాధ్యత వహించగలగాలి. సాకులు చెప్పకూడదు.
మానసికంగా బలంగా ఉండాలంటే, ఎమోషనల్ డ్రామాలకు దూరంగా ఉండాలి. ఇతరుల మెప్పు కోసం చేసే ఈ పనుల్లోకి దూరితే ఒక్కోసారి నష్టం కలగొచ్చు. ఇతరులను నిందించే గాసిప్పులలో పాల్గొని మీ వ్యక్తిత్వాన్ని కించపరుచుకోకండి. ప్రత్యేకించి ఏ ఒక్కరినో పాయింట్ చేసి నిందించకండి.
ఏ పరిస్థితిలోనైనా, మానసికంగా, భావోద్వేగాత్మకంగా బలమైన వ్యక్తిగా ఎదగాలంటే, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉండండి. అలాగే, సహాయం అడగడానికి సంకోచించకండి. ఎందుకంటే, నిశ్శబ్దంగా బాధపడటం కంటే బాధను తొలగించే మార్గాన్ని వెతకడం మంచిది కదా.
మానసికంగా బలపడాలంటే, మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయాలి. భావోద్వేగాత్మకంగా బలమైన వ్యక్తిగా మారేందుకు మీకు మీరే నిర్ణయం తీసుకోండి. ఎల్లప్పుడూ ఇతరుల అంగీకారం కోసం ఎదురుచూస్తూ కూర్చోకండి. ఒంటరిగానే సంతోషం వెదుక్కోవాలి.
భావోద్వేగాత్మకంగా, మానసికంగా బలమైన వారిలా ఉండాలంటే, ఎప్పుడూ భావోద్వేగాలకు లోనై మాట్లాడకండి. లేదా ఆ విధమైన ప్రవర్తన కనబరచకండి. ఒకవేళ భావోద్వేగాలకు లోనైనప్పుడు కూడా చాలా ఆలోచించి, జాగ్రత్తగా స్పందించండి.
మార్పు ప్రకృతి నియమం, దీన్ని బాగా అర్థం చేసుకోగలిగితేనే మానసికంగా బలపడతారు. ఏ మార్పునైనా సులభంగా అంగీకరించగలిగితేనే జీవితంలో ముందుకు సాగగలం. అవి మనుషులలో కలిగే మార్పులైనా, పరిస్థితులలో కలిగే మార్పులైనా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి.
ఇవేకాకుండా, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. పాజిటివ్ ఆలోచనతో వ్యవహరిస్తూ నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఇలా చేయడం వల్ల మీ దృష్టి మరలగుండా ఉంటుంది. ఏ ప్రయత్నమైన దృఢమైన నమ్మకంతో చేయండి. దాంతోపాటు మానసిక ఆరోగ్యం కావాలంటే, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని గుర్తుంచుకోండి. సమయానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు రోజువారీ వ్యాయామాలు చేస్తూ ఉండండి. సరైన నిద్రపోవడం కూడా ముఖ్యం. తరచూ ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ ఉండండి. మీరు బలహీనంగా ఉన్నారా, లేదా ఇతరులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారా.. అని తరచూ ప్రశ్నించుకుంటూ ఉండండి.
సంబంధిత కథనం