Dreams and Meanings : ఈ కలల గురించి ఎవరికీ చెప్పకండి.. చాలా సీక్రెట్‍గా ఉంచాలి
Meaning Of Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలను ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే వాటి నుంచి ఫలితాలు పొందలేరు. ఎలాంటి కలలను షేర్ చేయకూడదో తెలుసుకోండి.
Swapna Shastra : కలలు కనడం మానవ సహజం. కొన్ని కలలు మనల్ని సంతోషపరుస్తాయి, కొన్ని కలలు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని కలలు ఆందోళన కలిగిస్తాయి. కానీ డ్రీమ్ సైన్స్ ప్రకారం మనం కలలలో వచ్చిన వాటిలో కొన్నింటిని ఎవరితోనూ పంచుకోకూడదు. దీనివల్ల నష్టపోవడం ఖాయం.
కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవని పెద్దలు చెబుతారు. కలల శాస్త్రం ప్రకారం, కలలలో కనిపించే సంఘటనలు మన భవిష్యత్తుకు మంచి లేదా చెడు శకునాలను సూచిస్తాయి. కొన్ని కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలు కనడం కంటే ఇతరులతో పంచుకోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతుందని డ్రీమ్ సైన్స్ అంటోంది.
ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన కల ఉంటుంది. ఇది సహజమైన ప్రక్రియ. కానీ కొంతమంది తమ కలల అర్థం గురించి గందరగోళంగా ఉంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, మనం చూసే కలలు మన భవిష్యత్తుకు సంకేతాలు. ఇవి మనకు మంచివేనా? ఏదైనా చెడు చేస్తాయా? అనేది కాలమే తీర్పునిస్తుంది. కానీ కొన్ని కలలు డబ్బు గురించి కూడా ఉంటాయి. అలాంటి కలలను ఎవరితోనూ పంచుకోకూడదని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఎందుకంటే అలాంటి కలలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ ప్రయోజనం ఉండదు. ఎలాంటి కలలను ఇతరులతో పంచుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
కొన్నిసార్లు మనం ఇంట్లో మన ప్రియమైనవారి లేదా కుటుంబ సభ్యుల మరణం గురించి కలలు కంటాం. అలాంటి కలలంటే భయపడటం సహజం. వీటిని కొందరు అశుభమైనవిగా భావిస్తారు. కలల శాస్త్రం ప్రకారం, అలాంటి కలలకు భయపడాల్సిన అవసరం లేదు. స్వప్న శాస్త్రంలో ఇటువంటి కలలను శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు కూడా అలాంటి కలలు ఉంటే, మీ కలలో చనిపోయిన వ్యక్తి చాలా రోజులు జీవిస్తారని అర్థం చేసుకోండి. ఇది సుదీర్ఘ జీవితాన్ని సూచిస్తుంది. కానీ అలాంటి కలలను పొరపాటుగా ఇతరులతో పంచుకోకూడదు. అది మీ ఆనందాన్ని పాడు చేస్తుంది.
మీరు మీ తల్లిదండ్రులకు నీరు ఇస్తున్నట్లు కలలుగన్నట్లయితే, మీ భవిష్యత్తు బాగుపడుతుందని అర్థం. ఇది కూడా మంచిదే. మీరు భవిష్యత్తులో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి. ఈ కలలను ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు.
స్వప్న శాస్త్రం ప్రకారం చాలా మందికి భగవంతుని దర్శనం లభిస్తుంది. స్వప్న శాస్త్రంలో ఇది శుభప్రదమని నమ్ముతారు. భవిష్యత్తులో మీరు కలలుగన్న దానికంటే పెద్ద అవకాశాన్ని మీరు పొందబోతున్నారని దీని అర్థం. అలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకండి. అలా చేస్తే భవిష్యత్తులో అదృష్టాన్ని కోల్పోతారు.