బరువు త్వరగా తగ్గాలని పరిగెత్తకండి! ఎక్సర్‌సైజ్‌లు స్టార్ట్ చేసే ముందు ఈ విధానం పాటించండి!-dont run to lose weight quickly follow this method before starting exercises ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బరువు త్వరగా తగ్గాలని పరిగెత్తకండి! ఎక్సర్‌సైజ్‌లు స్టార్ట్ చేసే ముందు ఈ విధానం పాటించండి!

బరువు త్వరగా తగ్గాలని పరిగెత్తకండి! ఎక్సర్‌సైజ్‌లు స్టార్ట్ చేసే ముందు ఈ విధానం పాటించండి!

Ramya Sri Marka HT Telugu

బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గిపోవాలని ఆత్రుతగా పరిగెత్తాలని అనుకుంటున్నారా? ఇలా పరిగెత్తడం మీ కీళ్లపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి కేలరీలు బర్న్ చేసే సులువైన వ్యాయామాలను అనుసరించండి.

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా?

శరీర బరువు లేదా కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారు ఆవేశంతో పరిగెత్తాలని నిర్ణయించుకుంటున్నారా? రన్నింగ్ చేయడం వల్ల శరీర బరువు త్వరగా తగ్గిపోతామని అనుకుంటే పొరబడినట్లే. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, హెల్తీ బీఎమ్ఐ మెయింటైన్ చేయడానికి కొన్ని సులభమైన యాక్టివిటీలు చేయవచ్చు. ముఖ్యంగా, కీళ్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు ఎక్కువ కేలరీలు బర్న్ చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టడం మంచిది.

బరువు ఎక్కువగా ఉన్నవారికి అనుకూలంగా ఉండే వ్యాయామాలు ఇవే..

వాకింగ్:

ఫిజికల్ యాక్టివిటీని ప్రారంభించడానికి, ఇది చాలా ప్రభావవంతమైన వ్యాయామం. క్రమంగా వేగం, దూరం పెంచుకుంటూ ఉండొచ్చు.

స్విమ్మింగ్:

నీటిలో ఉండటం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. కీళ్లపై ఒత్తిడి ఉండదు. ఇది పూర్తి శరీరానికి మంచి వ్యాయామం.

సైకిల్ తొక్కడం:

నిలకడగా సైకిల్ తొక్కడం కేలరీలు బర్న్ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

వాటర్ ఎరోబిక్స్:

నీటిలో చేసే వ్యాయామాలు కీళ్లపై ఒత్తిడి లేకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి.

ఎలిప్టికల్ ట్రైనర్:

ఈ యంత్రం నడవడం, పరిగెత్తడం వంటి కదలికలకు అనుకూలంగా ఉంటుంది. కానీ, కీళ్లపై తక్కువ ఒత్తిడి ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాయామాలు:

ఇవి కేలరీలు బర్న్ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ముఖ్యం.

పైన పేర్కొన్న నడక, ఈత, సైకిల్ తొక్కడం కూడా కార్డియో వ్యాయామాలే. ఇవే కాకుండా తక్కువ బరువులతో చేసే ఎరోబిక్స్ క్లాసెస్ కూడా మంచివే. కండరాల నిర్మాణానికి, కొవ్వును కరిగించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. పరికరాలేమీ లేకుండానే శరీర బరువులతో చేయగల వ్యాయామాలైన స్క్వాట్స్, మోకాళ్లపై పుష్-అప్స్, లాంజ్లు వంటివి వ్యాయామాలు ప్రారంభించడానికి మంచివి. వీటితో పాటుగా డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‌లతో చేసే అనేక రకాల వ్యాయామాలు ఇబ్బందిగా అనిపించవు. మోకాలి జాయింట్లపై, చేతులపై ఎక్కువ బరువు పడకుండా ఉండే వర్కౌట్లు అనుసరించవచ్చు.

మెషీన్ వెయిట్ ట్రైనింగ్:

జిమ్‌లో అందుబాటులో ఉండే మెషీన్లు కండరాలపై వెయిట్ ఉంచడానికి సహాయపడతాయి. అవి క్రమంగా శరీరంలో బరువును తగ్గించడంతో పాటు కండరాలలో పటిష్టత పెరుగుతుంది.

వ్యాయామం మొదలుపెట్టే ముందు గుర్తుంచుకోవాల్సినవి

  • మీరు కొత్తగా వ్యాయామం చేస్తున్నా లేదా చాలా కాలం గ్యాప్ తర్వాత మొదలుపెడుతున్నా, శరీరం అలవాటు పడే వరకు తక్కువ తీవ్రతతో, తక్కువ సమయం పాటు వ్యాయామం చేయడం మంచిది.
  • మీ ఫిట్‌నెస్ స్థాయి మెరుగుపడిన తర్వాత, వ్యాయామం తీవ్రత, టైం అలాట్మెంట్, ఫ్రీక్వెన్సీని క్రమంగా పెంచండి. వారానికి కనీసం రెండు మూడు రోజులైనా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
  • కేలరీలు ఖర్చు చేయడానికి వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా అవసరం.
  • మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఏదైనా కొత్త వ్యాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. వీటన్నిటి కంటే ముఖ్యంగా శరీరాన్ని అర్థం చేసుకోండి. దానికి తగ్గట్టుగా వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోండి.

బరువు తగ్గాలనే ఆవేశంతో పరుగులు పెట్టారంటే, మోకాలి జాయింట్లలో నొప్పి కలగొచ్చు. మరికొందరిలో ఎముకలు అరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలివిగా, సురక్షితమైన విధానాన్ని అనుసరించడం వల్ల బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.