Head and Neck Cancer | గొంతు నొప్పి రెండు వారాలకు మించి ఉంటే అశ్రద్ధ చేయకండి!-dont neglect throat pain for two weeks know the lesser known facts of head and neck cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Dont Neglect Throat Pain For Two Weeks, Know The Lesser Known Facts Of Head And Neck Cancer

Head and Neck Cancer | గొంతు నొప్పి రెండు వారాలకు మించి ఉంటే అశ్రద్ధ చేయకండి!

HT Telugu Desk HT Telugu
May 10, 2023 09:52 AM IST

Head and neck cancer: తల - మెడ క్యాన్సర్లు లక్షణాలు తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం లక్షణాలు కొనసాగితే అశ్రద్ధ చేయకండి. ఇక్కడ డాక్టర్లు చెప్పిన కొన్ని సూచనలు చూడండి.

Head and neck cancer
Head and neck cancer (unsplash)

Head and Neck Cancer: కొందరు తమకు ఉన్న అనారోగ్యాన్ని దాచిపెడతారు, చిన్నదే కదా తగ్గిపోతుందిలే అని తేలిగ్గా తీసుకుంటారు. ఆ అనారోగ్య దీర్ఘకాలం పాటు కొనసాగినా నిర్లక్ష్యం చేస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తల, మెడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వివిధ క్యాన్సర్ రకాలలో ఇది 7వ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ఈ తల, మెడ క్యాన్సర్ సాధారణంగా మారింది. తల, మెడ క్యాన్సర్ అంటే ఈ ప్రాంతంలోని ఏదైనా భాగాలలో ముఖ్యంగా పెదవులు, నాలుక, నోరు, గొంతు భాగాలు ప్రభావితం అవుతాయి. వీటిని వైద్యపరిభాషలో ఓరోఫారింక్స్, నాసోఫారెక్స్, హైపోఫారింక్స్ క్యాన్సర్‌లుగా పేర్కొంటారు.

ఈ రకమైన క్యాన్సర్‌లలో లక్షణాలు చాలా సాధారణంగా అనిపించవచ్చు. దగ్గు, గొంతు నొప్పి, సైనస్‌ వలె అనిపించవచ్చు, కానీ ఇవి శోషరస కణుపులకు వ్యాపించే విధానాన్ని కలిగి ఉండవచ్చు. దీనిని బట్టి క్యాన్సర్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించవచ్చు. ముంబైలోని హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్‌లో హెడ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ యష్ మాథుర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో మాట్లాడారు. ఆయన మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల, మెడ క్యాన్సర్ గురించి చెప్పుకొచ్చారు. లక్షణాలు చాలా తేలికైనవిగా అనిపిస్తాయి, కానీ అప్రమత్తంగా ఉండాలన్నారు.

భారత్ లాంటి దేశాలలో సామాన్య, మధ్య తరగతి వారు ఎక్కువ ఉంటారు. క్యాన్సర్ వ్యాధి అనగానే ఖర్చు ఎక్కువ ఉంటుందని బయటపెట్టుకోరు. కానీ ఆలస్యం చేస్తేనే ఖర్చు పెరుగుతుంది. ముందుగానే గుర్తించి చికిత్స పొందితే ఏ సమస్య ఉండదని డాక్టర్ యష్ అన్నారు.

తల-మెడ క్యాన్సర్ లోని రకాలు, వాటి లక్షణాలు ఇలా ఉండవచ్చు.

నోటి క్యాన్సర్

దవడ భాగంలో వివరించలేని వాపు, పెదవులపై తిమ్మిరి, దంతాలు వదులుగా మారడం, నోటిలో ఎరుపు లేదా తెల్లటి మచ్చలు, చిగుళ్ళు, నాలుక లేదా బుగ్గల లోపల చాలాకాలంగా నయం కాని మచ్చలు. నోరు తెరవడంలో ఇబ్బంది, ప్రసంగంలో మార్పు, నోటిలో లేదా చిగుళ్ళ నుండి అసాధారణ రక్తస్రావం.

గొంతు క్యాన్సర్

2 వారాల తర్వాత కూడా నయం కాని గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి; మెడలో నొప్పి , నిరంతరంగా కొనసాగే దగ్గు; చెవులలో నొప్పి లేదా రింగింగ్; వినికిడిలో ఆకస్మిక ఇబ్బంది, స్వరంలో మార్పు లేదా బొంగురు స్వరం. చెవిలో నొప్పితో పాటు మింగడంలో ఇబ్బంది. ఓరల్ సెక్స్ కూడా గొంతునొప్పికి ఒక కారకం అని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి.

నాసోఫారెక్స్ క్యాన్సర్

తీవ్రతరం అయిన సైనసెస్, లక్షణాలు నయం కాకపోవడం, యాంటీబయాటిక్స్ కు స్పందించని దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు; ముక్కు నుండి రక్తం కారడం, తరచుగా తలనొప్పి, కళ్ళలో వాపు ఇతర ఇబ్బందులు, ఎగువ దంతాలలో ఎపిసోడ్లుగా నొప్పి

స్వరపేటిక క్యాన్సర్

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్వరం మారడం లేదా బొంగురుపోవడం, మింగడంలో నొప్పి, చెవి నొప్పి. ద్రవాలు మింగిన తర్వాత నిరంతర దగ్గు.

లాలాజల గ్రంధి క్యాన్సర్

చెవి ప్రాంతంలో నొప్పి, గడ్డం, దవడ ఎముక లేదా మెడ దిగువన నిరంతరమైన నొప్పి, దవడ ఎముక ప్రాంతంలో లేదా మెడలో ఎక్కడైనా ముద్దలాంటి కణజాలం లేదా వాపు, ముఖంలో పక్షవాతం, ఒక వైపు నోటి మూల నుండి లాలాజలం పడిపోవడం, పూర్తిగా నవ్వలేక పోవడం, నోటిలో గాలిని ఆపలేకపోవడం, కళ్లు మూతలు పడటం, పాక్షికంగా మూసుకుపోవడం లేదా మెడ వెంట నొప్పి ప్రసరించడం, చెవి నొప్పి మొదలైనవి.

ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి, త్వరగా చికిత్స చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం