పెంపకం అనేది ఒక అందమైన, బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా కొడుకును పెంచే విషయంలో ఈ ప్రయాణం మరింత సున్నితంగా మారుతుంది. నిజానికి బాల్యంలో తల్లిదండ్రులుగా కొడుకుకు ఇచ్చిన ప్రేమ, మద్దతు, మార్గదర్శకత్వం అతడి ఉత్తమ మనిషిగా మారుస్తుంది.
కొడుకు ఆలోచనకు, ఆత్మవిశ్వాసానికి, సంబంధాలకు పునాది వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రుల ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, ప్రతి నిర్ణయం అతని వ్యక్తిత్వంపై నేరుగా ప్రభావాన్ని చూపుతాయి. తల్లిదండ్రులు పిల్లల మానసిక వికాసానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించకూడదు.
తల్లిదండ్రలు తమకు తెలియక పెంపకం సమయంలో కొన్ని ప్రాథమిక తప్పులు చేస్తూ ఉంటారు. తాము చేస్తున్నది తప్పు అని కూడా వారికి తెలియదు. ఎలాంటి పనులు చేయడం వల్ల మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందో తెలుసుకోండి. కాబట్టి కొడుకును పెంచేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
కొడుకు భావోద్వేగాలను అణచివేయడం తప్పు. అబ్బాయిలు ఏడవకూడదని వారికి చెప్పకండి. అలా ఏడిస్తే అందరూ వెక్కిరిస్తారని వారికి చెప్పకండి. భావోద్వేగాలు ప్రతి మనిషికి ఉంటాయి. అమ్మాయిల్లో ఉన్నట్టే అబ్బాయిల్లో కూడా భావోద్వేగాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏడవడం ద్వారా అబ్బాయిలు కూడా తమ మనసులోని బరువును దించుకోవచ్చు. కాబట్టి మీ పిల్లవాడి భావోద్వేగాలను దాచమని చెప్పకండి. వారు లోపల విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం అలవాటు. ఉదాహరణకు, పొరుగువారి పిల్లవాడు తరగతిలో మొదటి స్థానంలో ఉంటే, అతన్ని మీ పిల్లవాడితో పోల్చకండి. తెలిసో తెలియకో చేసే ఈ పనివల్ల పిల్లవాడి ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలకు తిట్టడం లేదా మరొకరితో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో పాటు చిరాకు కూడా వస్తుంది. అందువల్ల, మీ పిల్లలను వేరొకరితో పోల్చడానికి బదులుగా, వారి సామర్థ్యాలను గుర్తించండి. సానుకూలంగా ప్రేరేపించండి.
చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల మాటలను పట్టించుకోరు. పిల్లవాడు ఏదైనా చెబుతుంటే, వారు అతడి మాట్లాడకుండా అడ్డుకుంటారు. పిల్లవాడి మాట వినడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అందువల్ల, పిల్లవాడు ఏదైనా చెప్పినప్పుడల్లా, అతను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది పిల్లవాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
చాలా ఇళ్ళలో తల్లిదండ్రులు తమ పిల్లవాడితో ‘ నువ్వు అబ్బాయివి, అన్నీ భరించాలి, మగాడిలా ఉండాలి, ఏడవకూడదు’ అని చెప్పడం మొదలుపెడతారు. ఇవన్నీ కొడుకు మనసుపై అనారోగ్యకరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది పిల్లవాడు తన బలహీనతలను, భావోద్వేగాలను దాచేలా చేస్తుంది. మీ కొడుకును మంచి వ్యక్తిగా పెంచండి. అంతే తప్ప అతనిలోని ఫీలింగ్స్ ను చంపేయకండి.
చాలా ఇళ్ళలో పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులతో ప్రత్యేకమైన బంధం ఏదీ లేనట్టు కనిపిస్తారు. నిజానికి, ఇది వారి పెంపకం ప్రభావం. తల్లిదండ్రులు కుమారుడికి మంచి విద్యను అందించడంలో నిమగ్నమై ఉంటారు. వారితో సమయాన్ని కేటాయించరు. దీని ప్రభావం ఏమిటంటే పిల్లవాడు క్రమంగా తల్లిదండ్రుల నుండి మానసికంగా దూరం కావడం ప్రారంభిస్తాడు. పెద్దయ్యాక అతనికి తల్లిదండ్రులతో ప్రత్యేకమైన ప్రేమ, బంధం ఏర్పడదు. కాబట్టి పిల్లవాడితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.
టాపిక్