Eating Mistakes: వేరుశనగ తిన్న వెంటనే వీటిని తిన్నారంటే అలర్జీల బారిన పడతారు
Eating Mistakes: ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పదార్థాల్లో వేరుశనగలు ముందు వరుసలో ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేరుశనగ ప్రియులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. వీటిని తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినడం వల్ల అలర్జీల బారిన పడే అవకాశాలున్నాయి. ఆ పదార్థలేంటో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండ్లలో వేరుశనగలు ముందు వరుసలో ఉంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వేడి వేడి వేరుశనగలు తినడంలో మజాయే వేరు. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ దొరికే వీటిని కొందరు ఉడికించుకుని తినడానికి ఇష్టపడితే.. మరికొందరు వేయించుకుని తింటారు. ఇవి రుచిలో అమోఘంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఏదైనా సరిగ్గా తినకపోతే ప్రయోజనానికి బదులుగా హాని తలపెడుతుంది. వేరుశనగ విషయంలోనూ అంతే. వేరుశనగను తిన్న వెంటనే కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
నీరు:
వేరుశనగలు తిన్న వెంటనే నీరు తాగడం చాలా ప్రమాదకరం. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. ఇవి పొడి, కఠినమైన ఆహారాలు ఇవి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణసమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక వేరుశనగలు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు నీరు తాగకుండా ఉండడం మంచిది.
చిక్కుళ్లు
వేరుశనగ తిన్న తర్వాత సోయా వంటి చిక్కుళ్లు తినడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితత్వం కలిగిన వారు అలర్జీ సమస్యలు ఉన్నవారు వేరుశనగ తిన్న తర్వాత వీటిని మరింత ప్రమాదకరం. అలాంటి వారు వీటిని తిన్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత మాత్రమే చిక్కుళ్ల జోలికి పోవాలి.
నువ్వులు:
వేరుశెనగ తిన్న తర్వాత నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలు కూడా తినకూడదు. సాధారణంగా నువ్వులు, పల్లీలు చేసిన వాటిని చలికాలంలో ఎక్కువగా తింటారు. కానీ ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడూ వీటిని కలిపి తినకూడదు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అలర్జీల సమస్య పెరుగుతుంది.
చాక్లెట్ :
వేరుశనగ తిన్న తర్వాత చాక్లెట్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. గింజల రూపంలోనే తిన్నప్పటికీ అలర్జీలు ఉన్నవారికి ఈ రెండింటి కలయిక అస్సలు మంచిది కాదు. చాక్లెట్ మాత్రమే కాదు చాక్లెట్ ఆధారిత ఉత్పత్తులను కూడా వేరుశనగలతో కలిపి లేదా తిన్న వెంటనే తీసుకోకూడదు. కనీసం ఒక గంట తర్వాత తినాలి.
సిట్రస్ పండ్లు:
వేరుశనగ తిన్న తర్వాత నిమ్మ, నారింజ, కివి, సిట్రస్ ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినకపోవడమే మంచిది. ఈ కలయిక ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. ముఖ్యంగా అలర్జీ సమస్యలు ఉన్నవారు వేరుశనగ తిన్న తర్వాత సిట్రస్ పండ్లు తినకూడదు. లేదంటే గొంతునొప్పి, చికాకు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.
ఐస్ క్రీం:
వేరుశనగలో చాలా నూనె ఉంటుంది. ఇది వేడి ఆహార పదార్థం అలాగే ఐస్ క్రీం చల్లగా ఉంటుంది. కనుక వేరుశనగలు లేదా పల్లీ చిక్కీ తిన్న వెంటనే ఐస్ క్రీం తినడం వల్ల గొంతు నొప్పి, చికాకు, గొంతులో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని తిన్న తర్వాత కనీసం అరగంట తర్వాత మాత్రమే ఐస్ క్రీం తినచ్చు.
టాపిక్