Plastic Water Bottle : ఎండలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?-dont drink water in plastic bottle in summer here is why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Don't Drink Water In Plastic Bottle In Summer Here Is Why

Plastic Water Bottle : ఎండలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 12:06 PM IST

Plastic Water Bottle Problems : ఇంట్లో ఉంటే.. ఓ గ్లాసులో నీళ్లు తాగుతారు. అదే బయటకు వెళితే.. మీ చేతిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది. ఎండలో ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీరు తాగితే మంచిదేనా?

ప్లాస్టిక్ వాటర్ బాటిల్
ప్లాస్టిక్ వాటర్ బాటిల్

అసలే ఎండాకాలం.. గడియ గడియకు దాహం వేస్తుంది. కొన్ని నీళ్ళు(Water) తాగామో లేదో.. మళ్లీ ఇంకొన్ని తాగితేనే.. హమ్మయ్యా అనిపిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు గ్లాస్ తీసుకెళ్లలేరు. కాబట్టి.. ప్లాస్టిక్ బాటిల్ ను మెయింటెన్ చేస్తారు. బాగా దాహం వేస్తే.. ఏదీ ఆలోచించం. ముందు నీళ్లు తాగామా లేదా అనేదే ముఖ్యం. కానీ ప్లాస్టిక్ బాటిల్స్(Plastic Water Bottle) లో నీళ్లు తాగితే.. చాలా ప్రమాదం. ఇక ఎండాకాలంలో అలా ఉపయోగిస్తే.. డేంజర్ ఎక్కువే.

రోజూ ఇంట్లోనే నీళ్లు తాగుతున్నాం కదా.. ఏం కాదులే.. అని లైట్ తీసుకుని.. కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ తాగుతుంటారు. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం ముప్పుతో కూడుకున్నది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ తాగకూడదు.

పరిశోధన ప్రకారం.. బాటిల్ వాటర్ తాగితే.. చాలా నష్టం. ప్లాస్టిక్ బాటిల్స్(Plastic Bottles) మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్ లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం(Health) దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది.

ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్(Breat Cancer) వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. బాటిల్ వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు(Health Problems)వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులుగా.. గ్లాస్ లేదా మెటల్ బాటిల్ ను వాడుకోవాలి.

ప్లాస్టిక్ బాటిల్స్ నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూస్ ప్లాస్టిక్(Single Use Plastic) బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఇలా కూడా అస్సలు చేయోద్దు.

WhatsApp channel

సంబంధిత కథనం