Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పుల వల్ల పిల్లలు మొండిగా తయారవుతారు, ఇలా ప్రవర్తించకండి-dont do these 5 parental mistakes that make kids stubborn ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పుల వల్ల పిల్లలు మొండిగా తయారవుతారు, ఇలా ప్రవర్తించకండి

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పుల వల్ల పిల్లలు మొండిగా తయారవుతారు, ఇలా ప్రవర్తించకండి

Haritha Chappa HT Telugu
Jan 24, 2025 09:31 AM IST

Parenting Tips: చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో పిల్లలకు సంబంధించి కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి వారికి సాధారణంగా అనిపించినా పిల్లల సున్నితమైన మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మీ పిల్లల స్వభావంలో మొండితనం, కోపం వంటివి పెరిగిపోతాయి. కాబట్టి మీలో ఉన్న ఈ 5 అలవాట్లను మార్చుకోండి.

పేరెంటింగ్ టిప్స్
పేరెంటింగ్ టిప్స్

పిల్లలను చక్కగా పెంచాలని, వారిని ఉత్తమ పౌరులుగా మార్చాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం రాత్రింబవళ్లు పిల్లల కోసమే ఆలోచిస్తారు, వారి కోసమే కష్టపడతారు. కొంతమంది పిల్లలు పిల్లవాడు స్వభావరీత్యా మొండిగా, కోపంగా మారిపోతారు. వారి మనస్సులో నిరాశ నిండిపోయి ఉంటుంది. అయితే ఇలా జరగడం వెనుక అసలు కారణం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చాలాసార్లు పేరెంట్స్ తెలిసో తెలియకో పిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి చూడటానికి సాధారణంగా అనిపించినా పిల్లల సున్నితమైన మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీ పిల్లల స్వభావంలో మొండితనం, కోపం వంటివి కనిపిస్తే మీరు వెంటనే జాగ్రత్త పడాలి. మీరు ఇలాంటి అయిదు పనులను చేయడం మానివేయాలి.

yearly horoscope entry point

పిల్లలతో తక్కువ మాట్లాడడం

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఈ తప్పు చేస్తారు. పిల్లలు తల్లిదండ్రుల నుండి కొంచెం సమయం, ప్రేమ ఆశిస్తాడు. కానీ తెలిసో తెలియకో మనలో చాలా మంది అలసట, టెన్షన్ లేదా ఏదైనా ఆందోళన కారణంగా మన పిల్లలతో ఎక్కువ సమయం గడపకుండా, వారితో మాట్లాడకుండా దూరంగా ఉంటారు. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోరు. పిల్లలను పట్టించుకోకపోతే, కొంతమంది పిల్లలు స్వభావరీత్యా మొండిగా ఉంటారు.

ప్రతిదానికి నో చెప్పడం

ఒక అధ్యయనం ప్రకారం, తల్లిదండ్రుల పిల్లలు ఏమి అడిగినా కూడా నో అనే చెబుతారు. ఇలాంటి పిల్లలు చాలా మారిపోతారు. ఇతరుల పట్ల సానుభూతి లేకుండా మొండిగా తయారవుతారు. అలాంటి పిల్లల్లో నైతికత లోపించే అవకాశం ఉంది. వారు ఏ విధమైన క్రమశిక్షణలో ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. వారికి ఏ విధమైన నియమాలు వర్తించవు. అందుకే తల్లిదండ్రులు నో చెప్పినప్పుడల్లా దానికి సరైన కారణాన్ని పిల్లలకు వివరించి చెప్పాలి.

కొట్టవద్దు

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం చాలా కష్టమైన విషయం. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రుల సహనం తగ్గినప్పుడల్లా వారు బిడ్డను ఒప్పించడానికి కొట్టడం వంటివి చేస్తారు. కానీ పిల్లల మనస్తత్వశాస్త్రం పిల్లలను కొట్టడం వల్ల వారి మనస్తత్వం మారిపోతుంది. వారి స్వభావాన్ని మొండిగా చేస్తుంది.

ఫోన్లు, టీవీలు

నేటి కాలంలో ఖరీదైన ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్ చేతిలో పెట్టి పిల్లల ఆనందాన్ని కొంటున్నారనుకుంటే పొరపాటే. ఇలా చేయడం వల్ల మీ పిల్లవాడు జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను నేర్చుకోవడంలో వెనుకబడిపోతాడు. ఇలా చేయడం ద్వారా మీరు అతని ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసానికి ఆటంకం కలిగించినట్టే లెక్క.

నియమాలు వద్దు

పిల్లలపై ఎలాంటి నియమాలు బలవంతంగా రుద్దుకండి . అలా చేయడం వల్ల మీ పిల్లల మనస్సులో కోపం పెరిగిపోతుంది. అతను మొండి స్వభావాన్ని అలవరచుకుంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డను ఏ పనైనా చేయకుండా ఎందుకు ఆపాలనుకుంటున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పండి.

Whats_app_banner

సంబంధిత కథనం