Foot Swelling: పాదాల వాపు చూసి భయపడిపోకండి.. ఇంటి చిట్కాలతో ఈజీగా వాటిని తగ్గించుకోండి!-dont be afraid of swollen feet get a solution to the problem with home tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foot Swelling: పాదాల వాపు చూసి భయపడిపోకండి.. ఇంటి చిట్కాలతో ఈజీగా వాటిని తగ్గించుకోండి!

Foot Swelling: పాదాల వాపు చూసి భయపడిపోకండి.. ఇంటి చిట్కాలతో ఈజీగా వాటిని తగ్గించుకోండి!

Ramya Sri Marka HT Telugu

Foot Swelling: పాదాలు వాయగానే కాళ్లకు ఏదో అయిపోయిందని భయపడిపోతుంటారు. వెంటనే వైద్యుడ్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని పరుగులు పెడుతుంటారు. కానీ, ప్రతీసారి ఈ సమస్యను అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలు పాటించి కూడా సమస్యను తగ్గించుకోవచ్చు.

పాదాల వాపును తగ్గించే ఇంటి చిట్కాలు

మనలో చాలా మందికి పాదాల వాపు అనేది సాధారణ సమస్యే. కొందరిలో వయస్సుతో పాటు కలిగితే మరికొందరిలో ఇంకొన్ని కారణాల వల్ల కలగొచ్చు. అవేంటంటే, ఎక్కువసేపు ఒకే చోట నిలబడి ఉండటం లేదా కూర్చోవడం, గాయాలు లేదా మూర్ఛ రావడం, గర్భధారణ, కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు, తీవ్రమైన మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు కూడా కాలి వాపుకు కారణం కావచ్చు. సాధారణ కారణాల వల్ల మీ పాదాలలో వాపు వస్తే, ఇంటి చిట్కాలను వాడి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాలి వాపును తగ్గించే ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

పాదాళ్లో వాపును తగ్గించే ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు:

1) ఐస్ ప్యాక్ లేదా ఐస్ బాత్

గాయంపై ఐస్ ప్యాక్ లేదా ఐస్ బాత్ వంటి చల్లని పదార్థంతో కాపండి. ఇవి, మీ రక్తనాళాలను సంకోచింపజేసి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. వాపు ఉన్న కాలిపై ఐస్ ముక్క పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

2) ఎప్సమ్ సాల్ట్

వెంటనే ఉపశమనం పొందడం కోసం, ఎప్సమ్ సాల్ట్ కలిగిన వెచ్చని నీటిలో కాలిని నానబెట్టండి. దీని కోసం బాత్ టబ్‌లో వెచ్చని నీటిని పోసి దాంట్లో ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్ కలపండి. దాదాపు 20 నిమిషాల వరకూ అందులో వాచిన పాదాలు మునిగేలా ఉంచండి.

3) నరాలపై ఒత్తిడిని తగ్గించండి

కాలిని పైకి లేపడం వల్ల మీ నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తం గుండెకు తిరిగి వెళ్ళడానికి తక్కువ నిరోధం కలిగి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా చేయడానికి, బెడ్‌పై పడుకుని, కాలి కింద దిండ్లు ఉంచండి. అలా చేయడం వల్ల కాళ్లు పైకి ఉండి రక్తప్రసరణ కాళ్ల దగ్గరే ఆగిపోకుండా ఉంటుంది.

4) కంప్రెషన్ స్టాకింగ్స్

వాపును తగ్గించడానికి కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించండి. కంప్రెషన్ స్టాకింగ్స్ మీ కాలి, మోచేతులపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, శరీరంలో ద్రవాలు పెరిగి పాదాలలో ఆగిపోయే ప్రమాదం నుంచి కాపాడతాయి.

పాదాల వాపు సమస్య తగ్గించుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

1) ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం మానుకోండి ఎందుకంటే ఇది వాపును మరింతగా పెరిగేలా చేస్తుంది.

2) నడక వంటి తేలికపాటి వ్యాయామం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

3) పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీ శరీరం నుండి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

4) కాలి వాపును నివారించడానికి బిగుతుగా ఉండే దుస్తులు లేదా అనుబంధాలను ధరించడం మానుకోండి. ఎందుకంటే బిగుతుగా ఉండే వస్తువులను ధరించడం వల్ల రక్త ప్రవాహం ఆగిపోయి వాపు పెరగవచ్చు.

5) అధిక ఉప్పు శరీరంలో ద్రవాలను నిలువ చేస్తుంది. కాబట్టి మీ శరీరంలో సోడియం స్థాయిని పరిమితం చేయడానికి ప్రయత్నించండి.

6) తక్కువ హీల్స్, మెత్తని పాదాలతో సౌకర్యవంతంగా ఉండేలా బూట్లు ఎంచుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం