చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? ముఖ్యమైన, గడిచిపోయిన విషయాలు ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదా. అయితే మీరు వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీ మెదడు ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే మీరు నెమ్మదిగా మతిమరుపుకు బానిస అయిపోతారు. అంత పని జరగకుండా ఉండాలంటే మెదడు ఆరోగ్యాన్ని పెంచే కొన్ని ఆహారాలను తినడం, వ్యాయామాలను చేయడం వంటివి అలవాటు చేసుకోండి.
నిజానికి శారీరక ఆరోగ్యం గురించి చాలామంది మాట్లాడుతారు కానీ మానసిక ఆరోగ్యం విషయానికి రాగానే నిర్లక్ష్యం చేస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మానసిక ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. కనుక ఆహారాలు, వ్యాయామాలతో మీ మెదడును చురుగ్గా మార్చుకోండి. ఆహారాల సంగతి పక్కన పెడితే మెమొరీ పవర్ ను పెంచే మూడు రకాల వ్యాయామాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం రండి. క్రమం తప్పనకుండా రోజూ ఈ మూడు వ్యాయామాలను చేయడం మెదడును ఉత్తేజపరిచడానికి, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఆలోచన సామర్థ్యాన్ని వృద్ధి చేయడానికి సహాయపడతాయి.
మెదడును చురుగ్గా మార్చడంలో శ్వాస వ్యాయామాలు చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం చేసేటప్పుడు ప్రశాంతమైన వాతారణం, ఒంటరి ప్రదేశంలో కూర్చొని కళ్లు మూసుకోవాలి. నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఒకటి నుంచి 5 వరకూ లెక్కించి నెమ్మదిగా గాలి వదిలేయండి. ఇలా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
కంటి వ్యాయామాలు కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు దోహదపడతాయి. ఇందుకోసం తల తిప్పకుండా కూర్చుని కేవలం కళ్లను మాత్రే ఎడమ వైపుకీ, కుడి వైపుకీ, పైకీ, కిందకీ తిప్పండి. తరువాత వృత్తాకారంలో(గుండ్రంగా) తిప్పడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం కంటి కండరాలను బలపరుస్తుంది. స్క్రీన్ టైమ్ కారణంగా వచ్చే అలసటను తగ్గిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఈ వ్యాయామాన్నిరోజూ 2 నిమిషాలు పాటు చేయండి.
రోజూ కొంత సమయం స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా తయారవుతుంది. కండరాలను, కీళ్లను సాగదీయం వల్ల మొత్తం శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫలా పెరుగుతుంది. ముఖ్యంగా మెదడుకు సరిపడా ఆక్సిజన్ అంది ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెచింగ్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్