Beauty tips: చలికాలంలో ముఖం నల్లగా వాడిపోయినట్టు కనిపిస్తోందా? ఇలా చేయండి అప్పటికప్పుడు మెరుపు వచ్చేస్తుంది
Beauty tips: చలికాలంలో చర్మం నల్లబడినట్టు కాంతి విహీనంగా మారుతుంది. ఈ సమస్య మీ అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో చర్మాన్ని మెరిపించడానికి ఈ హోం రెమెడీస్ పాటించండి.
శీతాకాలంలో చర్మం రంగు మారిపోతుంది. చర్మం నల్లబడినట్టు, కళావిహీనంగా మారుతుంది. దీనివల్ల ముఖం రంగు మసకబారడం, నీరసంగా మారినట్టు కనిపిస్తుంది. చలికాలంలో వీచే చల్లని గాలి ముఖంలోని తేమను పీల్చేసి నిర్జీవంగా మారుస్తాయి. చర్మం తేమను కాపాడుకోవడానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కానీ కొంత కాలం తర్వాత ఈ లోషన్లు చర్మాన్ని నల్లగా మార్చడం ప్రారంభిస్తాయి. మీకు ఇలాంటి సమస్య ఉంటే, శీతాకాలంలో కోల్పోయిన ముఖం రంగును తిరిగి పొందడంలో మీకు సహాయపడే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.
బంగాళాదుంప రసంతో
బంగాళదుంపలు ప్రతి ఇంట్లోను ఉంటాయి. వీటి రసాన్ని తీసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని నలుపుదనం తొలగిపోతుంది. ఈ రెమెడీ చేయడానికి, మొదట, బంగాళాదుంపను సన్నగా తురిమి దాని రసాన్ని తీయండి. ఆ తర్వాత బంగాళాదుంప రసాన్ని కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి.
టమోటా రసం
టమోటోలు కూడా ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. ఈ జ్యూస్ ను వాడడం ద్వారా కూడా ముఖం రంగును మెరుగుపరచుకోవచ్చు. ఈ రసం పొడి చర్మం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. టొమాటో జ్యూస్ రెమెడీ చేయడానికి, ముందుగా టమోటాను తురిమి దాని రసాన్ని తీయండి. దీని తరువాత టమోటా రసాన్ని వేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. కాసేపు తరువాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి. టమోటాల్లో ఉండే విటమిన్ సి చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ముల్తానీ యట్టి
ముల్తానీ మట్టిని ఉపయోగించడం ద్వారా కూడా ముఖాన్ని మెరిపించుకోవచ్చు. ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని నలుపుదనం తొలగిపోతుంది. ముల్తానీ మిట్టిలో యాంటీ సెప్టిక్ లక్షణాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది చర్మం నలుపును క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ముల్తానీ మట్టి రెమెడీ కోసం తయారు చేయడానికి, ఒక గిన్నెలో 4 టీస్పూన్ల ముల్తానీ మట్టి, 2 టీస్పూన్ల నిమ్మరసం, 4 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ గ్లిజరిన్ వేసి పేస్టులా తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పేస్ట్ క్లీన్ అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరుస్తూ ఉంటుంది.