Slapped cheek Virus: మీ పిల్లల బుగ్గలు ఎర్రగా మారితే మురిసిపోతున్నారా? అది ఇప్పుడు పెద్ద డేంజర్ లక్షణం
Slapped cheek Virus: పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వైరస్‌లలో స్లాప్డ్ చీక్ వైరస్ ఒకటి. ఇప్పుడు అమెరికాలో ఎంతో మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య కేవలం పిల్లలకే కాదు ఎవరికైనా రావచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ముఖంపై ఎర్రటి దద్దుర్లుతో పాటు కొద్దిగా జ్వరం కూడా ఉంటుంది.
చాందీపురా వైరస్, మంకీపాక్స్ వంటి వైరస్‌లు ఇప్పటికే ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా వైరస్ పెట్టిన బాధను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ మధ్యన అమెరికాలో మరో వైరస్ వ్యాపించడం మొదలైంది. దాని పేరు పార్వోవైరస్ బి19. ఇది ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తోంది. అమెరికాలో 5 నుంచి 9 ఏళ్ల లోపు పిల్లల్లో 35 శాతం మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా ఆ పిల్లలు బుగ్గలు ఎర్రగా ఎవరో కొట్టినట్టు వాచిపోయినట్టు కనిపిస్తున్నాయి. పిల్లల బుగ్గలు టమోటాల్లా ఎర్రగా మార్చే ఈ స్టాప్డ్ చీక్ వైరస్ గురించి తెలుసుకుందాం.
పార్వోవైరస్ బి 19 అంటే ఏమిటి?
పార్వోవైరస్ బి 19 ఒక సాధారణ ఫ్లూ లాంటి వైరస్, ఇది ఎక్కువగా పిల్లలను వేటాడుతుంది. అయితే, ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ముఖంపై ఎర్రటి దద్దుర్లుతో పాటు కొద్దిగా జ్వరం కూడా ఉంటుంది. అమెరికాలో 40 ఏళ్ల లోపు వారిలో ఈ వైరస్ సర్వసాధారణం. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, పార్వోవైరస్ బి 19 యొక్క మినీ-వ్యాప్తి ప్రతి మూడు నుండి నాలుగు సంవత్సరాలకు సంభవిస్తుంది.
పార్వోవైరస్ బి 19 వైరస్
పార్వోవైరస్ బి 19 ను 'ఫిఫ్త్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వైరస్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇన్ఫెక్షన్ కారణంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పిల్లలను ప్రభావితం చేసే ఈ వ్యాధిని తెలుగులో ‘చెంపదెబ్బ సిండ్రోమ్’ అని పిలుచుకోవచ్చు.
స్లాప్డ్ చీక్ వైరస్ అంటువ్యాధి
చెంపలకు వచ్చే ఈ వైరస్ పిల్లలను త్వరగా అనారోగ్యానికి గురిచేస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి లాలాజలం, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు నుంచి వెలువడే తుంపర్ల ద్వారా గాలిలో వ్యాపించి మరో వ్యక్తికి సోకుతుంది. అంతేకాకుండా ఈ వైరస్ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా సోకుతుంది.
లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో చెంపలపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. కీళ్ల నొప్పులు వేధిస్తాయి. తేలికపాటి జ్వరం, తీవ్ర అలసట, ముఖ కండరాల నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి, కండరాల నొప్పులు కనిపిస్తాయి. అయితే కేవలం పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా ఈ వ్యాధి రావచ్చు.
చెంప వైరస్ నుండి ఎలా రక్షించుకోవాలి
- మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.
- చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారం తీసుకోవాలి.
- వైరస్ సోకిన వ్యక్తి నుంచి సరైన దూరం పాటించాలి.
- ఎవరికైనా ఈ వైరస్ సోకితే ఆ ప్రదేశానికి దూరంగా ఉండండి.
ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?
కొంతమంది కచ్చితంగా పార్వోవైరస్ బి19 వైరస్‌కు దూరంగా ఉండాలి. ఇందులో గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, రక్త కణాల రుగ్మతలు ఉన్నవారు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఈ వైరస్ తీవ్రంగా ప్రభావం చూసే అవకాశం ఉంది.
టాపిక్