Kids Acne Diet: 8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా? వెంటనే వారి డైట్లొ నుంచి ఈ పదార్థాలను తీసేయండి!-does your child get acne at the age of 8 14 remove these foods from their diets immediately ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Acne Diet: 8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా? వెంటనే వారి డైట్లొ నుంచి ఈ పదార్థాలను తీసేయండి!

Kids Acne Diet: 8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా? వెంటనే వారి డైట్లొ నుంచి ఈ పదార్థాలను తీసేయండి!

Ramya Sri Marka HT Telugu
Jan 31, 2025 10:30 AM IST

Kids Acne Diet: సాధారణంగా టీనేజ్‌లో వచ్చే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు మీ పిల్లలకు 8 నుంచి 14ఏళ్ల వయస్సులోనే ప్రారంభమవుతున్నాయా? అయితే వెంటనే మీరు వారి డైట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను వారికి దూరంగా ఉంచాల్సి చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.

8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా?
8-14 ఏళ్ల వయసులోనే మీ పిల్లలకు మొటిమలు వస్తున్నాయా? (shutterstock)

సాధారణంగా మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు టీనేజ్ నుంచి అంటే 14 నుంచి 16 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచీ ప్రారంభమవుతాయి. దీన్ని కౌమారదశ అని పిలుస్తారు. కౌమారదశలో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. కానీ ఇప్పుడు 8 ఏళ్ల చిన్న వయసులోనే అబ్బాయిలు, అమ్మాయిలు మొటిమలు, ముఖంపై మచ్చల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మీ పిల్లలు కూడా ఎనిమిది నుంచి పద్నానులేళ్ల లోపు వారే అయి ఉండి ఇటువంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

చిన్న వయసులోనే ఈ చర్మ సమస్యలు రావడానికి కారణం ఏంటి?

  1. నిజానికి చర్మంపై మచ్చలు, మొటిమలు హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి. ఈ వయసులో శరీరంలో హార్మోన్లు వేగంగా మారుతాయి. దీని వల్ల అధిక సీబమ్ ఉత్పత్తి అవుతుంది అలాగే ఈ సీబమ్ చర్మ రంధ్రాలను అడ్డుకుంటుంది. దీని వల్ల ముఖంపై మచ్చలు రావడం ప్రారంభమవుతాయి.
  2. మరో ముఖ్య విషయం ఏంటంటే.. చాలా సార్లు పిల్లలకు మొటిమలు రావడానికి కారణం వారి జుట్టులో చుండ్రు అయి ఉండచ్చు. కనుక పిల్లల తల ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రకరకాల షాంపూలు, నూనెలు వాడటంతో పాటుగా చుండ్రు సమస్యను పెంచే ఆహారాలను కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మీ ఇంట్లో 8-14 ఏళ్ల పిల్లలకు మొటిమలు లేదా చుండ్రు సమస్య ఉంటే వారి డైట్లో నుంచి వెంటనే తొలగించాల్సిన కొన్ని ఆహార పదార్థాలున్నాయని ప్రముఖ డైటీషియన్ మనప్రీత్ ఇన్స్టాగ్రామ్‌లో సలహా ఇచ్చారు.

పిల్లల డైట్లో ఉండకూడని పదార్థాలు:

చాక్లెట్లు, కేకులు కుకీలు

పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం పూర్తిగా ఆపండి. ఇందులో ఉన్న అధిక చక్కెర ఇన్సులిన్‌ను పెంచుతుంది. వీటి వల్ల చర్మం దెబ్బదింటుంది. ఇది మొటిమలతో పాటు అనేక చర్మ సమస్యలకు కారణం అవుతుంది. కనుక చాక్లెట్లకు బదులుగా ఇంట్లో తయారుచేసిన ఖీర్, హల్వా, గులాబ్ జామూన్ వంటి ఆహారాలను ఇవ్వడం ప్రారంభించండి.

సోడా పానీయాలు

పిల్లలు సాఫ్ట్ డ్రింక్స్, సోడా పానీయాలు తాగడానికి చాలా ఇష్టపడతారు. కానీ వీటి కన్నా ప్రమాదకరమైనవి లేవని తెలుసుకోండి. వీటిలోని కాఫిన్, చక్కెర స్థాయిలు హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయి. వీటి ప్రభావం చర్మంలో సీబమ్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. కనుక తల్లిదండ్రులుగా మీరు పిల్లలను వీటని దూరంగా ఉంచండి. కోలాకు బదులుగా కాంజీ, పండ్ల రసాలు వంటి వాటిని ఇవ్వడంపై దృష్టి పెట్టండి.

కాఫీ నుండి దూరంగా ఉంచండి

పిల్లలకు కాఫీ ఇవ్వడం కూడా హానికరం. అధిక కాఫిన్ శరీరాన్ని ఎండిపోయేలా చేస్తుంది. దీని వల్ల చర్మం కూడా ఎండిపోతుంది. మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక పిల్లల చర్మాన్ని సడలించడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి చమ్మోలీ టీ వంటివి ఇవ్వండి.

బ్రెడ్లు ఇవ్వడం మానేయండి

బ్రెడ్‌లో ఉన్న కార్బోహైడ్రేట్ల వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల వారిలో మొటిమలు పెరుగుతాయి. కనుక వీటికి బదులుగా పిల్లలకు మిల్లెట్స్ తో చేసిన రొట్టెలు ఇవ్వండి.

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి

పిల్లలలో మొబైల్, టీవీ, కంప్యూటర్ వంటి స్క్రీన్ సమయాన్ని తగ్గించి, బయట ఆట సమయాన్ని పెంచండి. దీని వల్ల శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత సమస్య ఉండదు. హార్మన్ల సమతుల్యంగా పనిచేస్తే మొటిమలతో పాటు ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండచ్చు.

ప్యాకేజ్డ్ ఆహారాలు

చిప్స్ వంటి సాల్డెడ్, ప్యాకేజ్డ్ ఆహారాలను పిల్లలకు ఎంత దూరంగా ఉంచిదే అంత మంచిదని గుర్తుంచుకోండి. వీటిలోని అధిక ఉప్పు, మసాలాలు వంటివి శరీరంలో నీటిని నిలువ చేస్తాయి. వాపుకు, మొటిమలకు కారణమవుతాయి.

పిల్లలు అడిగారనో, మారం చేస్తున్నారనో వీటిని తరచూ ఇవ్వడం వల్ల వారి చర్మంతో పాటు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక వీటి నుంచి వారిని దూరంగా ఉంచాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఈ వయసులో వారి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.

Whats_app_banner